నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్, కౌంటింగ్ సాగనుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ ఆఫీసీయో సభ్యులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
READ MORE: Nani : చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ పై అప్ డెట్ ఇచ్చిన నాని..
ఇక పోటీలో ఎంఐఎం, బీజేపీ ఉన్నాయి. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలోకి దిగారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో… ఓటర్లుగా హైదరాబాద్ జిల్లాకు చెందిన జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీసీయో మెంబర్స్, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం ఓటర్లు 112 కాగా.. అందులో కార్పొరేటర్లు 81, ఎక్స్ ఆఫీషియె సభ్యులు 31మంది ఉన్నారు.
READ MORE: Pahalgam Terror Attack : పహల్గాం దాడి వెనక పాక్ కేంద్రంగా నడిచే ఉగ్రవాద సంస్థ..
పార్టీల వారిగా బలాబలాలు చూస్తే.. ఎంఐఎంకు 41 కార్పొరేటర్లు, 9 ఎక్స్ ఆఫీషియో సభ్యులు మొత్తం 50 మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీకి 18 కార్పొరేటర్లు, 6 ఎక్స్ ఆఫీషియో సభ్యులు మొత్తం 24 మంది ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ కు ఏడుగురు కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ ఆఫీషియో సభ్యులు మొత్తం 14 మంది ఉండగా.. బీఆర్ఎస్‌కు15 కార్పొరేటర్లు, 9 ఎక్స్ ఆఫీషియో సభ్యులు మొత్తం 24 మంది ఓటర్లు ఉన్నారు. సరిపడ సంఖ్య బలం లేకున్నా తొలి సారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచింది బీజేపీ.. 22 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరగనుంది..