బీహార్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. బీజేపీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. ఇక కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ కొద్దిరోజులుగా ‘‘పలయన్ రోకో, నౌక్రీ దో’’ (వలసలను ఆపండి, ఉద్యోగాలు కల్పించండి) పేరుతో పాదయాత్ర చేస్తున్నారు.
Rahul Gandhi: వక్ఫ్ సవరణ బిల్లు-2025ని పార్లమెంట్ ఆమోదించింది. అయితే, ఆమోదం పొందినప్పటికీ దీనిపై రచ్చ ఆగడం లేదు. కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పార్టీల నేతలు వక్ఫ్ బిల్లును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. వక్ఫ్ తర్వాత ఆర్ఎస్ఎస్ కాథలిక్ చర్చిలను, క్రైస్తవ సమాజాన్ని టార్గెట్ చేయబోతోందని హెచ్చరించారు.
వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ వెన్నుచూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూయిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని…
కాంగ్రెస్, బీఆర్ఎస్లు మజ్లిస్ పార్టీకి బానిసలుగా మారిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మజ్లిస్ మెప్పు కోసమే ఇతర పార్టీలు వారి అడుగులకు మడుగులు వత్తుతున్నాయని తెలిపారు. అన్ని పార్టీలు పోటీ చేస్తాయని భావించామని, కానీ రాహుల్ గాంధీ, కేసీఆర్లు పోటీ చేయకుండా మజ్లిస్కు ఏకగ్రీవం చేయాలని యత్నించారని కిషన్ రెడ్డి…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా… ఐదేళ్ళు నిక్షేపంగా కొనసాగాలని కేసీఆర్ కోరుకుంటున్నారా? అవును… మీరేం తప్పుగా వినలేదు. ముమ్మాటికీ నిజమే. రేవంత్రెడ్డి సర్కార్ నిక్షేపంగా పూర్తి టర్మ్ పవర్లో ఉండాలని, ఆయుష్మాన్భవ అంటూ…. స్వయంగా గులాబీ దళపతే దీవించారట. ఇదేదో… వినడానికి బాగున్నట్టు అనిపిస్తోందిగానీ… ఎక్కడో తేడా కొడుతోందని అనుకుంటున్నారా? ఎస్… మీ డౌట్ నిజమే. ఆ తేడా ఏంటో చూసేయండి. తెలంగాణలో పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి 16 నెలలవుతోంది.…
Waqf Bill: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు ‘‘వక్ఫ్ సవరణ బిల్లు-2025’’ని నెగ్గించుకుంది. పార్లమెంట్లోని ఉభయసభల్లో మెజారిటీ సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ సహా సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకే, వామపక్షాలు,
Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారడమే మిగిలింది. ఈ బిల్లు ముస్లింలకు మేలు చేకూరస్తుందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే చెబుతుండగా, ఇది ముస్లింల హక్కుల్ని కాలరాస్తుందని కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మూడు 'సీ'లు కలిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది.. ఆ మూడు 'సీ'లే.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కంట్రీ కలవాలి.. అప్పుడే దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి.. కర్నూలులో జరుగుతోన్న ఏఐకేఎస్ సదస్సులో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఆలిండియా కిసాన్ సభ 90 ఏళ్ల క్రితం ఏర్పాటైంది.. స్వాతంత్రానికి పదేళ్ల ముందే స్థాపించి స్వాతంత్ర్య పోరాటం చేసిన మొదటి రైతు సంఘం ఏఐకేఎస్ అన్నారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్షాల పైనే దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు ఉదయం సాధారణ దుస్తులతో తెలంగాణ భవన్కు పోలీసులు వచ్చారని, ఎందుకు వచ్చారని ప్రశ్నించగా, దిలీప్ కొణతం, మన్నె క్రిశాంక్లకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో లక్ష మంది పోలీసులు ఉన్నా, మహిళలకు రక్షణ లేకుండా…
హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావుని పార్టీ ప్రకటించింది. గౌతమ్ రావు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడుగా పని చేశారు. కాగా.. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.. గత నెల 27వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది.. 7వ తేదీన నామినేషన్ల పరిశీలన, 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ అవకాశం…