PCC Chief Mahesh Goud: మళ్లీ అధికారం మాదే.. రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలుస్తాం..
- మాది రైతు ప్రభుత్వం.. నిజామాబాద్లో రైతు మహోత్సవం నిర్వహిస్తున్నాం..
- బీఆర్ఎస్ రైతు వ్యతిరేక పార్టీ.. రైతుల గురించే మాట్లాడే అర్హత లేదని వెల్లడి..
- మళ్లీ అధికారం మాదే.. రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలుస్తాం: మహేష్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCC Chief Mahesh Goud: నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. మాది రైతు ప్రభుత్వం.. అందుకే నిజామాబాద్ లో రైతు మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించటమే రైతు మహోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం అని తేల్చి చెప్పారు. ఇక, నిజాం సాగర్, శ్రీరాం సాగర్ ప్రాజెక్టుల పూడికను తీయటానికి త్వరలో టెండర్లు పిలుస్తామని ఆయన వెల్లడించారు. అయితే, బీఆర్ఎస్ రైతుల వ్యతిరేక పార్టీ.. బీఆర్ఎస్ రైతులను నట్టేటా ముంచింది అని ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu: అమిత్‌షాతో చంద్రబాబు కీలక చర్చలు..
Also Read
అయితే, నిజామాబాద్ జిల్లాలో కొత్త షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తెలిపారు. 10 ఏళ్ళల్లో నిజామాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కేటీఆర్, కేసీఆర్ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇక, బీఆర్ఎస్ పని అయిపోయింది.. మళ్ళీ మాదే అధికారం, రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు.. ఇన్ డైరెక్ట్ గా బీజేపీకి మద్దతిచ్చి బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుంది అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ అనేది ఉండదని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
-
ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
-
Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
-
Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన ‘యేషనాగుల’.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!