Minister Ponguleti: యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండల కేంద్రంలో భూ భారతి అవగాహన సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ప్రజలకు భారంగా మారింది అందుకే భూ భారతి తీసుకొచ్చాం అని పేర్కొన్నారు. ఇక, నలుగురు వ్యక్తులు చేసిన చట్టమే ధరణి.. ధరణి పోర్టల్ అమలు చేసే సమయంలో వంద రోజులు రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆరోపించారు. భూ భారతి చట్టం అందరి ఆమోదయోగ్యంతో చేశామని తేల్చి చెప్పారు. మే 1వ తేదీ నుంచి 28 జిల్లాలోని ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసుకుని అమలు చేస్తాం అని మంత్రి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Kamal Haasan: త్రిష తో బనానా జోక్.. ఈ వయసులో అవసరమా?
ఇక, రాష్ట్రంలో భూమి లేని నిరు పేదలకు ఇందిరమ్మ భూమీ పట్టాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు.. కానీ, వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేశాడు అని మండిపడ్డాడు. అధికారులు భూ భారతి చట్టాన్ని దుర్వినియోగం చేస్తే కఠి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ భూ భారతి పోర్టల్ వాళ్ల ప్రతి ఒక్కరు సులభంగా భూ సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు.