Congress: పహల్గామ్ ఉగ్రదాడి.. బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..
- పహల్గామ్ ఉగ్రదాడిలో 27 మంది మృతి..
- దాడిని ఖండిస్తూనే, బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో టూరిస్టుల్ని టార్గెట్ చేస్తూ, ఉగ్రవాదులు దారణమైన దాడికి పాల్పడ్డారు. పక్కా పథకంలో వచ్చిన టెర్రరిస్టులు, అమాయకులైన పర్యాటకుల ప్రాణాలు తీశారు. మంగళవారం జరిగిన ఈ దాడిలో 27 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ దాడికి సంబంధించి ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. అత్యున్నత సమావేశం కోసం అమిత్ షా హుటాహుటిన శ్రీనగర్ వెళ్లారు.
Read Also: Health Tips: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే చాలు.. ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
ఇదిలా ఉంటే, ఈ దాడిపై కాంగ్రెస్ నేత, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించామని, సాధారణ పరిస్థితిని పునరుద్ధరించామని ‘‘ఖాళీ వాదనలు’’ చేయడానికి బదులుగా కేంద్రం బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పర్యాటకులపై దాడి హృదయ విదారకంగా ఉందని అన్నారు. ‘‘జమ్మూ కాశ్మీర్‌లో ఖాళీ వాదనలు చేయడానికి బదులుగా, ప్రభుత్వం జవాబుదారీతనం వహించి, భవిష్యత్తులో ఇలాంటి అనాగరిక సంఘటనలు జరగకుండా, అమాయక భారతీయులు ఇలా ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందిస్తూ, ఇది మానవత్వంపై మచ్చగా అభివర్ణించారు. ఉగ్రవాదులపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని అధికార బీజేపీని కోరారు .”దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి, దానిని తీవ్రంగా ఖండిస్తుంది” అని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టామని గతంలో చెప్పిన బీజేపీ, ఇప్పుడు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
जम्मू-कश्मीर के पहलगाम में हुए कायराना आतंकी हमले में पर्यटकों के मारे जाने और कई लोगों के घायल होने की ख़बर बेहद निंदनीय और दिल दहलाने वाली है।
मैं शोकाकुल परिवारों के प्रति गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के जल्द स्वस्थ होने की आशा करता हूं।
आतंक के खिलाफ पूरा देश…
— Rahul Gandhi (@RahulGandhi) April 22, 2025
I strongly condemn the cowardly terror attack on innocent tourists in Pahalgam, Jammu & Kashmir. The entire nation is united in fighting the scourge of cross-border terrorism.
These dastardly targeted attacks are a blot on humanity. News reports indicate that precious lives…
— Mallikarjun Kharge (@kharge) April 22, 2025
తాజావార్తలు
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!