Kangana Ranaut: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆ పార్టీ బ్రిటిష్ వలసవాద వారసత్వం, గతంలో జరిగిన ఉగ్రవాద చర్యలకు ఆ పార్టీ భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయి.. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో ఆశాంతి, భయానక వాతావరణం ఉండేదని తెలిపింది.
నాగార్జున సాగర్ లో ములుగు సీఆర్పీఎఫ్ బెటాలియన్ పోయి విశాఖ సీఆర్పీఎఫ్ బెటాలియన్ వచ్చిందన్నారు.. ఇప్పుడు సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయింది.. కేసీఆర్ సీఎంగ ఉన్నాన్ని రోజులు సీఆర్పీఎఫ్ బలగాలను సాగర్ కు రానివ్వలేదు అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోంది.. ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలేవో.. నీళ్ళేవో ప్రజలకు తెలిసిపోయింది అని మండిపడ్డారు. ఆనాడు LRS ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
CM Revanth Reddy: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తండ్రి తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గొప్ప సాహితీవేత్త కుమారి అనంతన్ (హరికృష్ణన్ నాడార్ అనంత కృష్ణన్) మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
HCU Lands Issue: హైదరాబాద్ నగరంలోని కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లలో విచారణకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ హాజరయ్యారు. ఈసందర్భంగా హెచ్‌సీయూ భూముల విషయంలో తప్పుడు పోస్టులు పోస్ట్ చెయ్యడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షులకు పవర్స్ అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీ అధ్యక్షులకు అప్పగిస్తూ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఏఐసీసీ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాలు బుధవారంతో ముగియనున్నాయి. మంగళవారం పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. నేటి సమావేశం ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ‘‘భారత రాజ్యాంగం 1000 ఏళ్ల పాతది’’ అని రాహుల్ గాంధీ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగం బీఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, సంత్ కబీర్ ఆలోచనల్ని కలిగి ఉందని అన్నారు. పాట్నాలో జరిగిన ‘‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’’ కార్యక్రమంలో రామహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Congress: అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ కీలక సమావేశం జరుగుతోంది. ఆరు దశాబ్ధాల తర్వతా గుజరాత్లో ఏఐసీసీ అత్యున్న సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న 2000 మంది వరకు ప్రముఖ నేతలకు ఆహ్వానం అందింది. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో 7 కీలక తీర్మానాలు చేసింది.
Rajasthan: రాజస్థాన్‌కి చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత జ్ఞాన్దేవ్ అహుజాను పార్టీ నుండి సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల అల్వార్‌లోని ఒక ఆలయాన్ని కాంగ్రెస్‌కి చెందిన దళిత ఎమ్మెల్యే సందర్శించారు. దీని తర్వాత, అహుజా గంగా జలంలో ఆలయాన్ని ‘‘శుద్ధి’’ చేయడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ నేత టికారం జుల్లీ ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన తర్వాత అహుజా ఈ చర్యకు పాల్పడ్డాడు. దళిత ఓటర్లు కీలక పాత్ర పోషించే తూర్పు రాజస్థాన్‌లో…