BJP vs Congress: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ..‘‘అవసరమైన సమయాల్లో మిస్ అవుతారు’’ అని కామెంట్ చేసింది. ప్రధానిని సూచించే ఒక ఫోటోని పోస్ట్ చేసి, దానికి తల లేకుండా ఉంచింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు పాక్ పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎంపీ చామల మాట్లాడుతూ.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజలు గమనించాలని కోరారు.…
కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆందోళన జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంఛార్జ్ కేకే మహేందర్ స్టేజీ మీద ఉండగానే రసాభాస చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు మాట్లాడుతుండగా పార్టీ నాయకులు అడ్డుకున్నారు.
EX Minister Jagadish Reddy: ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభపై ప్రజల్లో చర్చ జరుగుతోంది అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇక, సభకు వచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ చెప్పలేదని సీఎం బాధపడుతున్నారు ఎద్దేవా చేశారు.
Jagga Reddy: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ పూర్తి చేశారు.. కాంగ్రెస్ చేసిన రుణమాఫీకి.. కేసీఆర్ చేసిన రుణమాఫీకి తేడా ఉందన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యం గా ఉండాలి.. తెలంగాణ- ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చల అంశాన్ని లీడ్ చేయాలని చూస్తోందా..? కేంద్రం ఇప్పటికే ఏరివేతలో బిజీగా ఉంటే... కాంగ్రెస్ ఇప్పుడు చర్చల మాట ఎందుకు మాట్లాడుతోంది? టార్గెట్ పెట్టి మరీ... కేంద్ర బలగాలు మావోయిస్టులను ఏరిపారేస్తున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వ మాటలు చెవికెక్కుతాయా? కేంద్రం తగ్గుతుందా..? గత అనుభవం అధిష్ఠానం పరిశీలనలో ఉందా..
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలపై రంగంలోకి దిగింది ఏఐసీసీ.. పార్టీ లైన్ కి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన నాయకులను అంతర్గతంగా మందలించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Minister Seethakka: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్ చూసాకా... ఓ నియంత అధికారం పోయాక ప్రజల దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నట్టు ఉంది అని మంత్రి సీతక్క ఎద్దవా చేశారు. బాధ ఎవరి కోసం.. అధికారం పోయిందని బాధ తప్పితే ఇంకేం బాధ అని ప్రశ్నించింది.
Minister Ponguleti: వరంగల్ లో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ మంచి సూచన ఇస్తారేమో అనుకున్నాం.. కానీ, ఆయన మనసంతా విషం నింపుకున్నాడు అని మండిపడ్డారు.