Ponguleti Srinivasa Reddy: నిర్మల్ జిల్లాలోని కుంటాల సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భూములు ఉన్నవారికి రక్షణ కల్పించడమే భూ భారతి లక్ష్యం అన్నారు. నాలుగు పైలెట్ మండలాల్లో 13 వేల అప్లికేషన్లు వచ్చాయి.. సాధ్యమైనంత వరకు సమస్యలు అన్ని పరిష్కరిస్తాం.. ధరణి వల్ల ఇబ్బంది పడ్డారో అలాంటి సమస్య భూ భారతిలో ఉండదు.. ఉదయం పేరు కనిపించి మరుసటి రోజు పేరు మాయం అయ్యేది ధరణిలో.. భూ భారతిలో అలాంటి పరిస్థితి ఉండదని తేల్చి చెప్పారు. రైతు గుండె మీద చేయి వేసుకొని పడుకోవచ్చు.. ఉద్దేశ పూర్వకంగా ఏ అధికారి తప్పు చేస్తే అప్పీల్ కు వెళ్ళొచ్చు.. ఇప్పుడు అప్పీల్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నాం.. ఏ అప్లికేషన్ ఇచ్చినా పైసా ఖర్చు లేదు.. ఎవ్వరి చుట్టూ తిరగాల్సిన పని లేదని పేర్కొన్నారు. అలాగే, జూన్ 2వ తేదీ నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ యంత్రాగం వస్తుంది అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
Read Also: Heavy Rain Forecast: దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..
అయితే, పాత 9 లక్షల 26 అప్లికేషన్ లో న్యాయమైన వాటికీ పరిష్కారం చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రతి భూమిని సర్వే చేయాల్సిన అవసరం ఉంది.. సరిహద్దులతో పాటు సర్వే మ్యాప్ లు పెట్టుతాం.. భూ భారతి చట్టంలో ఉంది.. వెయ్యి మంది సర్వేయర్లను నియమించే ప్రక్రియ కొనసాగుతుంది.. లైసెన్స్ సర్వేయర్లను 6 వేల మందిని నియమిసున్నాం.. అయితే, గత ప్రభుత్వం వీఆర్ఓలను జూన్ 2వ తేదీ నుంచి గ్రామాల్లోకి పంపిస్తాం.. భూ భారతి అమలులో తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే.. నాటి సీఎం అప్పులు చేసి పెట్టారు.. కానీ, మా ప్రభుత్వం డబ్బులు ఉంటే దాచుకునే దోచుకునేది కాదని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.