Adi Srinivas: ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉందని చీప్ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అధికారుల కమిటీలు సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్నాయి.. ఉద్యోగుల ప్రమోషన్ ఇవ్వనప్పుడు.. డీఏలు ఇవ్వని పార్టీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు.. హరీష్ రావు పార్టీ పెడతారు అని ప్రచారం జరుగుతుంది.. అందుకే బుజ్జగించడానికి కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లాడని ఆరోపించారు. అయితే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నలుగురే.. ఇప్పుడు నలుగురే అని పేర్కొన్నారు. హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్లి పార్టీలో ఉండాలని బ్రతిమిలాడుకుంటున్నాడని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
Read Also: CJI BR Gavai: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్‌కు సన్మానం
అయితే, హరీష్ రావును పక్కన పెట్టారు ఫోటో లేకుండా చేశారని ప్రభుత్వ చీప్ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సయోధ్య కోసం బావ బామ్మర్దులు కలిసి ఉంటారు.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మూసివేయం అన్నారు. దేవాలయ పూజలు కొనసాగుతాయి.. 150 కోట్ల రూపాయలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.. శృంగేరి పీఠంకి అనుబంధంగా ఉంటుంది వేములవాడ ఆలయం.. శృంగేరి పీఠం అనుమతి లేకుండా ఇటుక కూడా తీయం అన్నారు. ఆలయాన్ని మూసేయ వద్దు.. దర్శనాలు కొనసాగాలని చెప్పారు.. ఆలయ విస్తరణ పనులు చేస్తున్నాం.. 30 గుంటలది.. నాలుగు ఎకరాలు విస్తరణ చేస్తున్నాం.. ఇంద్రుడు, సూర్యుడు, రాముడు, పంచ పాండవులు దర్శనం చేసుకున్న దేవాలయం.. శృంగేరి పీఠం చెప్పినట్టే చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు.