Off The Record: బీఆర్ఎస్ విషయంలో బీజేపీ గేమ్ ప్లామ్ మారిందా? పార్టీ సీనియర్ లీడర్సే అందుకు సంబంధించిన పావులు కదుపుతున్నారా? కారు గేర్స్‌ని ఎక్కడికక్కడ జామ్ చేయాలన్నది కమలం వ్యూహమా? సోషల్ మీడియాలో జరుగుతున్న బీఆర్‌ఎస్ విలీనం ప్రచారానికి బీజేపీ ముఖ్యులు కూడా స్వరం కలిపి సరిగమప అనడం వెనకున్న మతలబేంటి?
Read Also: Off The Record: ఏపీ సచివాలయంలో ఏదేదో జరిగిపోతోందా..? మంత్రుల శాఖల్లో ఓఎస్డీలదే ఇష్టారాజ్యమా..!
తెలంగాణలో ముక్కోణపు రాజకీయం యమా హాట్ హాట్‌గా మారుతోంది. అదీకూడా.. ఏడాదిన్నర క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కేంద్రంగా జరుగుతుండటం ఉత్కంఠను పెంచుతోంది. మొన్నటిదాకా గులాబీ పార్టీని బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ అంటే.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనంటూ కాషాయ దళం కౌంటర్స్ వేసింది. తాజాగా అది ఇంకొంచెం అడ్వాన్స్ అయిపోయి ఏకంగా బీఆర్‌ఎస్ విలీనం గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఆ విషయంలో కొత్త రాగం అందుకున్నారు కాషాయ నేతలు. బీఆర్ఎస్‌ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ సోషల్ మీడియా పోస్ట్‌లు జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. బీజేపీ నాయకులు కొందరు దానికి వంత పాడటం లేటెస్ట్ హాట్. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరింది…. అంతా మాట్లాడేసుకున్నారు.. ఇక సంతకాలు చేసుకోవడమే మిగిలిపోయిందంటూ.. సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తరువాత బీఆర్‌ఎస్.. కాంగ్రెస్‌లో విలీనమైపోతుందంటూ.. సోషల్ స్టోరీస్‌లో ఎవరికి వారు స్టాంప్‌లు వేసేస్తున్నారు.
Read Also: Vijay Devarakonda : బిజీ లైఫ్ లో పేరెంట్స్ తో గడపండి.. విజయ్ స్పెషల్ పోస్ట్
ఇక, ఆ ప్రచారం అలా జరుగుతున్న క్రమంలోనే.. బీజేపీ సీనియర్ లీడర్ ఎన్వీవీఎస్ ప్రభాకర్ ఎంటరైపోవడంతో సీరియస్‌నెస్ పెరిగింది. ఆయనైతే, వాళ్ళందరికంటే ఓ అడుగు ముందుకేసి డీల్ ఫిక్స్ అయిపోయింది. ముఖ్యమంత్రి మార్పు కూడా తథ్యం. రేవంత్‌రెడ్డి స్థానం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంలో.. ఒక్కసారిగా కలకలం రేగింది రాజకీయవర్గాల్లో. ఎన్వీవీఎస్ ఏమీ చిన్నా చితకా నాయకుడు కాదు. గతంలో పలు పదవులు నిర్వహించిన నాయకుడే. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడారంటే… తెర వెనక నిజంగానే ఏదో జరిగిపోతోందా అని చర్చించుకోవడం మొదలైందట అన్ని వర్గాల్లో. ఇక్కడే ఇంకోరకమైన అనుమానాలు కూడా వస్తున్నాయట. సడన్‌గా బీజేపీ నేతలు ఈ రాగం ఎందుకు అందుకున్నారు? ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చూస్తుంటే…. అలాంటి వాసన కూడా రావడం లేదు. అలాంటప్పుడు బీజేపీ సీనియర్ లీడర్ అల్లాటప్పా స్టేట్‌మెంట్ ఇచ్చారా అంటూ క్వశ్చన్‌మార్క్ ఫేసులు పెడుతున్నారట ఎక్కువ మంది. ఈ అనుమానాల సంగతి తెలిసినా సరే…. వెనక్కి తగ్గకపోగా… తమకు స్పష్టమైన సమాచారం ఉందని బీజేపీ నేతలు అంటున్నట్టు తెలుస్తోంది.
Read Also: CM Chandrababu: రేపు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
అయితే, ఇదంతా బీజేపీ మైండ్ గేమ్ అన్న మరో వెర్షన్ కూడా ప్రచారంలో ఉంది. గులాబీ శ్రేణులను గందరగోళంలో పడేసేందుకే కమలం నాయకులు ఇలా మాట్లాడుతుండవచ్చన్న అనుమానాలు పెరుగుతున్నాయట. 2014లో కూడా కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనమైపోతోందన్న ప్రచారం జరిగింది. అయినా అలాంటిదేం జరగలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉంటుందన్నది కొందరి మాట. అయినా సరే.. బీజేపీ మాత్రం తగ్గడం లేదు. గతంలో బీఆర్‌ఎస్ నేతల మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలో ఉన్నాసరే.. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదంటేనే.. రెండు పార్టీల మధ్య ఉన్న బంధమేంటో అర్ధమవుతోందన్నది బీజేపీ వెర్షన్. గులాబీ ముఖ్యులకు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయన్నది కాషాయ దళం ఆరోపణ. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. నోటి మాట చెప్పినంత తేలిక కాదు. పదేళ్ళు అధికారంలో ఉండి, తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్న పార్టీని విలీనం చేయడం అంత తేలికా అన్నది ఎక్కువ మంది క్వశ్చన్. ఏది నిజమో తేలాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందేనంటున్నారు పొలిటికల్ పండిట్స్.