Minister Ponnam: హైదరాబాద్ నగర అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన జీహెచ్ఎంసీ సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి పనులపై చర్చించాం అని తెలిపారు. ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాను.. వర్షాకాలంలో వచ్చే సమస్యలను తగ్గించేలా క్షేత్ర స్థాయిలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించాం.. ఇక, నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేస్తాం.. స్ట్రీట్ లైట్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం.. అలాగే, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఇప్పటి వరకు ఇంటిని ఆక్యూపై చేసుకొని వారి విషయంలో ఏం చేయాలనే అంశంలో ఆలోచిస్తున్నామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Read Also: BRS Party: మెట్రో టికెట్ రేట్స్ పెంపు.. ధరలు తగ్గించాలని బీఆర్ఎస్ డిమాండ్
ఇక, తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు త్వరలో పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు. అలాగే, మెట్రో టికెట్ ధరల పెంపుపై కూడా తన దృష్టికి వచ్చిందని అన్నారు. వయబుల్ కాని కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లుగా వారు చెబుతున్నారు.. దానిపై ప్రభుత్వం సమీక్ష చేస్తుంది.. హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రిగా నేను కూడా ఛార్జీలు తగ్గించమని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తాను అని వెల్లడించారు.