కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు.. ఇది సాధ్యమా అని అడిగారు. మన సభకు ప్రజలు రాకుండా అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు.. బీఆర్ఎస్ సభల్ని ఆపుతారా.. ఈ ప్రభంజనాన్ని ఎలా ఆపుతారు అని అడిగారు..
Mani Shankar Aiyar: కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై మాట్లాడుతూ.. ‘‘భారత్ పాక్ విభజన యొక్క పరిష్కారం కాని సమస్య’’తో ముడిపెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ నేత నళిన్ కోహ్లీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత, దేశ మొదటి ప్రధాని నెహ్రూ అతడి విధానాలను అయ్యర్ ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారని అన్నారు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ టార్గెట్‌గా అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘మీరు 15 రోజులు పాకిస్తాన్లో బస చేశారా..? మీ భార్య పాకిస్తాన్‌కి చెందిన ఎన్జీవో నుంచి జీతం పొందుతుందా..?’’ అని ప్రశ్నలు సంధించారు. ఎక్స్ వేదికగా గొగోయ్‌కి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీ భార్య, వారి పిల్లల పౌరసత్వ స్థితిని కూడా ఆయన ప్రశ్నించారు.
ఎమ్మార్పీఎస్ రాయల సీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ఉన్న లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యాడు.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో ఆలూరు రోడ్డు చిప్పగిరి రైల్వే బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది.. గుంతకల్ నుండి చిప్పగిరికి లక్ష్మీనారాయణ వెళ్తుండగా హత్య చేశారు..
Vaddiraju Ravichandra : వరంగల్ లో జరగనున్న బీఆర్ఎస్ సభకి వెళ్ళ నీయకుండా వాహనాలను నిలిపి వేయడం చట్ట విరుద్ధమని ఇది పద్ధతి కాదని బీఆర్ఎస్ నేతలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, జిల్లా ఆధ్యక్షుడు తాత మధు అంటున్నారు. ప్రైవేటు స్కూల్ బస్సులను అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యం లో నడుస్తున్న వాహనాలను బి ఆర్ఎస్ సభ కు వెళ్లనివ్వకుండా అడ్డుకోవటం సరి కాదని అన్నారు. గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ సభను అడ్డు కున్నది తాము…
Kishan Reddy: తెలంగాణ రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులను చాలా చురుకుగా అమలు చేస్తోంది. ఇందులో.. కీలకమైన ఎకనమిక్ కారిడార్లు, ఇతర వ్యూహాత్మక అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు, పర్యాటకాన్ని ప్రోత్సహించే, అనుసంధానతను పెంచే, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసే వివిధ ప్రాజెక్టులున్నాయి.
V. Srinivas Goud: రజతోత్సవ సభతో తెలంగాణ ప్రజల్లో మళ్ళీ ఆశలు చిగురించాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ తమకు అండగా ఉన్నారు అనే ధైర్యం మళ్ళీ ప్రజల్లో కలుగుతోంది.. కేసీఆర్ ప్రసంగం వినేందుకు లక్షలాదిగా రేపు వరంగల్ సభకు తరలి రానున్నారు.
CM Siddaramaiah: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత సైన్యం సర్వం సిద్ధంగా ఉంది. మరోవైపు, పాకిస్తాన్ కూడా ఇండియా నుంచి ఎదురయ్యే దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కాంగ్రెస్ నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదలు పెట్టా.. 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది.. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.. సగం దూరం నడిచేటప్పటికి నేను గతంలో లాగా లేను.. ప్రజలతో ఎలా మాట్లాడాలో.. వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నా.. నేను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదు అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించాం.. దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం.. మహిళలను కోటీశ్వరులను చేయడమే మా అజెండాగా పెట్టుకున్నాం.. మహిళా పారిశ్రామిక వేత్తలను బడా పారిశ్రామిక వేత్తలుగా చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి