Brian Bennett: టీ20 వరల్డ్‌కప్‌లో ఔట్ కాని బ్యాటర్ బెన్నెట్.. మూడు ఇన్నింగ్స్‌లలో 175 రన్స్!
- సూపర్-8కు దూసుకొచ్చిన జింబాబ్వే
- అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బెన్నెట్
- టీ20 వరల్డ్‌కప్‌లో ఔట్ కాని బ్యాటర్ బెన్నెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zimbabwe Star Brian Bennett’s 175 Runs Without Dismissal in T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026లో లీగ్ దశ ముగిసింది. శనివారం (ఫిబ్రవరి 21) నుంచి సూపర్-8లో ఆరంభం కానుంది. పసికూన జింబాబ్వే అద్భుత ఆటతో సూపర్-8కు దూసుకొచ్చింది. బలమైన ఆస్ట్రేలియాను ఓడిస్తే ఏదో గాలివాటం గెలుపు అనుకున్నారు. ఆతిథ్య శ్రీలంకను కూడా ఓడించి తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించింది. ఇక సూపర్-8లో మరోసారి షాకులు ఇవ్వడానికి సిద్దమైంది. లీగ్ దశలో జింబాబ్వే విజయాల్లో యువ బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ కీలక పాత్ర పోషించాడు. ఈ వరల్డ్‌కప్‌లో బెన్నెట్ అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన బ్రియాన్ బెన్నెట్.. ఒక్కసారి కూడా ఔట్ కాలేదు. ఒమాన్‌పై 48 నాటౌట్, ఆస్ట్రేలియాపై 64 నాటౌట్, శ్రీలంకపై 63 నాటౌట్.. ఇలా వరుసగా కీలక ఇన్నింగ్స్‌లు ఆడి 175 పరుగులు చేశాడు. ముఖ్యంగా ప్రతి మ్యాచ్‌లో చివరివరకు నిలబడి జట్టును విజయానికి దగ్గర చేయడం అతని ప్రత్యేకతగా నిలిచింది. అతడి బ్యాటింగ్ సగటు అద్బుతంగా ఉంది. ఈ గణాంకాలతో మెగా టోర్నీలో బెన్నెట్ అత్యంత స్థిరమైన బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
Also Read: Abhishek Sharma: ఫిట్‌నెస్ లేకున్నా.. ఆ భయంతోనే అభిషేక్ శర్మను ఆడిస్తున్నారా?
బ్రియాన్ బెన్నెట్ ఆటలో కనిపిస్తున్న పరిపక్వత, ఒత్తిడిలోనూ వికెట్ కాపాడే తీరు, చివరి వరకూ మ్యాచ్ ముగించే ధోరణి అతడిని భవిష్యత్ స్టార్‌గా నిలబెడుతున్నాయి. కేవలం పరుగులు చేయడం మాత్రమే కాదు.. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా ఆడడం అతని ఎదుగుదలకు సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ వరల్డ్‌కప్‌లో బెన్నెట్ ప్రదర్శన జింబాబ్వే జట్టుకు పెద్ద బలం. అతడు ఇదే ఫామ్ కొనసాగిస్తే టోర్నీలో కీలక మ్యాచ్‌ల్లో జింబాబ్వే గెలిచే అవకాశాలు ఉన్నాయి. జింబాబ్వే సెమీస్ చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!