కేసీఆర్ సభ పైనా ప్రజల కంటే కాంగ్రెస్ నాయకులకే ఇంట్రెస్ట్ పెరిగింది అని సెటైర్ వేశారు. కేసీఆర్ ఏం మాట్లాడుతారు అని కాంగ్రెస్ నేతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని హరీష్ రావు తెలిపారు.
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.. ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ ప్రారంభమవుతుంది.. ఇప్పటికే కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.. మరో రెండు, మూడు గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది.. మొన్న జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు..
బాలుడి కిడ్నాప్.. గంటలో చేధించిన పోలీసులు పాతబస్తీ చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. అయితే, ఈ సంఘటనలో పోలీసులు వేగంగా స్పందించడంతో గంటలోనే బాలుడిని రక్షించి, కిడ్నాపర్లను పట్టుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక బాలుడిని అతని బాబాయి సాదిక్ దగ్గరకు తీసుకెళ్లారు. సాదిక్ బాలుడిని ఓ వైన్ షాప్ కు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన సాదిక్ స్పృహ కోల్పోయి రోడ్డు పక్కనే పడిపోయాడు. ఈ…
MP Laxman: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తూ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుందన్నారాయన. కాంగ్రెస్ నేతలు CWC సమావేశంలో దాడి ఘటనను పొలిటికల్ ఈవెంట్‌లా మార్చే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. భద్రతా సమస్యపై అసత్య ప్రచారాలు…
Rahul Gandhi: ఇజ్రాయిల్ గూఢచార సంస్థ "మొసాద్" ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిండెన్‌బర్గ్ సంస్థ పలుమార్లు అదానీని లక్ష్యం చేసుకుంటూ సంచలన నివేదికలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికల ఆధారంగా మన దేశంలో ప్రతిపక్షాలు అధికార బీజేపీపై తీవ్ర విమర్శలు చేశాయి. అయితే, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాత్ర ఉన్నట్లు మొసాద్ కనుగొంది. రాహుల్ గాంధీ అదానీని లక్ష్యంగా చేసుకుని హిండెన్‌బర్గ్‌తో ‘‘సమన్వయం’’ చేసుకున్నట్లు ఆరోపించింది. కాంగ్రెస్,…
Mallikarjun Kharge: పహల్గామ్ ఉగ్రదాడి భారత దేశంపై దాడిగా భావించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్ర వాదులకు కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలి అని కోరారు. జాతీయ భద్రతపై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అన్నారు.
పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. తొలిసారిగా 600కు 600 మార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్తీర్ణత శాతం నమోదైంది. కాగా, ఇవాళ విడుదలై టెన్త్ ఎగ్జామ్ ఫలితాల్లో ఓ విద్యార్థిని సంచలనం సృష్టించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే స్టూడెంట్ ఏకంగా 600 మార్కులకు గానూ 600 స్కోర్ సాధించింది. రాష్ట్ర చరిత్రలో 100 శాతం మార్కులు సాధించిన తొలి విద్యార్థినిగా ఈ విద్యార్థి…
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్, కౌంటింగ్ సాగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ ఆఫీసీయో సభ్యులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
Congress: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్లో టూరిస్టుల్ని టార్గెట్ చేస్తూ, ఉగ్రవాదులు దారణమైన దాడికి పాల్పడ్డారు. పక్కా పథకంలో వచ్చిన టెర్రరిస్టులు, అమాయకులైన పర్యాటకుల ప్రాణాలు తీశారు. మంగళవారం జరిగిన ఈ దాడిలో 27 మంది మరణించారు. ఇందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు.
వాళ్ళు చర్చిస్తారు… నిర్ణయిస్తారు.. నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. బస్… అక్కడితో మేటర్ ఖతం. తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలన్న ఆలోచన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఉండదా? లేదా మనం మీటింగ్‌లు పెట్టి బిస్కెట్ తిని ఛాయ్తాగి వెళ్ళిపోతే… నిర్ణయాలు వాటంతట అవే అమలైపోతాయని ఫీలవుతారా? ఏకంగా పార్టీ చెప్పిన మాటకు కూడా దిక్కులేదా? ఇక్కడ ఓన్లీ టెలింగ్స్..!? నో ఇంప్లిమెంటేషన్సా? అంతా… తలపండిన నేతలే. ఎవరికి ఎవరూ తీసిపోరు. వ్యూహరచనలు, ఎత్తులకు పైఎత్తులు వేయడంలో కూడా అందరూ…