Congress vs BJP: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్ ) వేదికగా చేసిన పోస్టులో.. ఎంపీ గోగోయ్ పాకిస్తాన్, నేపాల్ దేశాల్లో పర్యటనలకు సంబంధించిన "స్పష్టమైన ఆధారాలు" తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేరళలో శుక్రవారం ఇండియా బ్లాక్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.వేదికపై ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ఉండగానే, ఇండీ కూటమిపై విమర్శలు ఎక్కుపెట్టారు. తిరువనంతపురంలో విజింజం అంతర్జాతీయ ఓడరేవు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన పక్కన నిలబడడంతో కొంత మందికి నిద్ర పట్టదని హస్తం పార్టీపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేరళలో విజింజం అంతర్జాతీయ ఓడరేవును మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ హాజరయ్యారు.
CM Revanth Reddy : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాల మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరుగుతుంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి, దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన జనగణన అంశాలపై ఈ భేటీలో చర్చలు జరుగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు సమావేశానికి హాజరవుతారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా హాజరయ్యేలా పార్టీ…
తుంగతుర్తి కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఎమ్మెల్యే మందుల సామేల్ వెంట ఉంటే.. మరొక వర్గం జిల్లా సీనియర్ నేతల వెంట నడుస్తోందన్నది ఓపెన్ టాక్. కొంత కాలంగా రెండు వర్గాల క్యాడర్ మధ్య మాటలు పేలుతున్నాయి.
లోక్సభ సభ్యుడు.... తన నియోజక వర్గంలో ఎక్కడైనా సరే.. ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం ఇచ్చి తిరగొచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఉద్దేశ్యపూర్వకంగా గొడవ పెట్టుకోవాలనుకుంటే తప్ప.. సాధారణంగా లొల్లి ఎందుకులే అనుకుంటూ అందర్నీ కలుపుకుని పోతుంటారు ఎంపీలు. కానీ.... నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి ఇప్పుడో చిక్కొచ్చి పడిందట.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతానికి చర్యలు చేపట్టి 2027 మార్చి నాటికి ఉదండాపూర్ వరకు నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు సత్వర చర్యలకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం.. పాలమూరు జిల్లా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది అని ఆరోపించారు.
Minister Ponguleti: భూ భారతి పోర్టల్ విస్తృత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూ భారతికి అనూహ్య స్పందన లభిస్తుంది. నాలుగు పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి అయ్యాయి.
Jagga Reddy: రాహుల్ గాంధీ జోడో యాత్రలో దేశ ప్రజల సమస్యలకు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రధాన అంశం కుల గణన.. కుల గణన చేయాలని రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు.