BRS Party: హైదరాబాద్ మెట్రో టికెట్ ధరల పెంపును తక్షణం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి హైదరాబాద్ నగర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారీ భారం మోపుతున్న టికెట్ ధరల పెంచారు.. ధరల పెంపుతో ఒక ప్రయాణికుడికి నెలవారీ ఖర్చు రూ.500-600 పెరుగుతుంది పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.. మెట్రో ధరల పెంపు వల్ల మెట్రో రైలు వినియోగం తగ్గి, ఇతర వాహనాల వలన ట్రాఫిక్, కాలుష్య సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లడించారు.
Read Also: Free Bus Scheme: మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం.. ఉచిత బస్సు ప్రయాణం అమలుపై కీలక ప్రకటన
అయితే, ప్రజల అవసరాల కంటే ప్రైవేట్ లాభాలకే ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. బెంగళూరులో ఇదే తరహాలో పెంచిన కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంది అని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో కూడా మెట్రో చార్జీల పెంపు పైన ప్రజా వ్యతిరేకత రావడం ఖాయం అని తెలిపారు. మెట్రో విస్తరణపై ప్రకటనలకు పరిమితమైన తెలంగాణ ప్రభుత్వానికి… ఉన్న మెట్రోను నడపడం చేతకావడం అని విమర్శలు గుప్పించారు.