నేడు మెగాస్టార్ గా జనం మదిలో నిలచిన చిరంజీవి తన తరం హీరోల్లో నవలానాయకునిగానూ జేజేలు అందుకున్నారు. అంతకు ముందు తెలుగునాట నవలానాయకునిగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జైత్రయాత్ర చేశారు. ఆయన తరువాత తెలుగు చిత్రసీమలో ఆ క్రెడిట్ చిరంజీవికే దక్కుతుందని చెప్పవచ్చు.
దక్షిణాదిన విజయవంతమైన చిత్రాల కథలతో హిందీ సినిమాలు రూపొంది అలరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యాభై ఐదేళ్ళ క్రితం హిందీలో 'దో కలియా' అదే తీరున సందడి చేసింది.
Ranbir Kapoor:ఇప్పటికే సంజయ్ దత్ బయోపిక్ గా రూపొందిన 'సంజూ'లో నటించి, భలేగా సందడి చేసిన రణబీర్ కపూర్ మరో బయోపిక్ చేయనున్నాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. ప్రఖ్యాత గాయకుడు కిశోర్ కుమార్ జీవితం నేపథ్యంలో రూపొందబోయే చిత్రంలో తాను నటిస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణబీర్ పేర్కొన్నాడు.
చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపం. ఆరడుగులకు పైగా ఎత్తు. ముఖ్యంగా యాక్షన్ హీరోకు కావలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న లియామ్ నీసన్ కు జేమ్స్ బాండ్ పాత్ర పోషించే అవకాశం వచ్చిందట!
పిన్నవయసులోనే కన్నుమూసిన హీరో తారకరత్న గురించి, ఇప్పుడు నందమూరి అభిమానులు విశేషంగా చర్చించుకుంటున్నారు. నిజానికి తారకరత్న కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ లేకపోయినప్పటికీ, నందమూరి ఫ్యాన్స్ కు ఆయనంటే అంత అభిమానం!
ఒకప్పుడు నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించిన ఇలియానా డి'క్రుజ్ ఇప్పుడు ముద్దుగా బొద్దుగా తయారయింది. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఉత్తరాదికి ఉరకలు వేసి, దక్షిణాదిపై - ముఖ్యంగా తనకు స్టార్ డమ్ సంపాదించి పెట్టిన టాలీవుడ్ పై కామెంట్స్ చేసింది.