హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. మీ పాన్ కార్డ్ సమాచారం అప్‌డేట్ కోసం మీకు పంపిన ఎస్సెమ్మెస్ లేదా ఈ-మెయిల్ క్లిక్ చేయమని మోసగాళ్లు కోరతారని, దాన్ని క్లిక్ చేయొద్దని కోరింది. పాన్ కార్డ్ డిటైల్స్ అప్‌డేట్ చేయాలని కోరుతూ మీకు వచ్చే గుర్తు తెలియని లింక్‌లను క్లిక్ చేయొద్దని.. ##GoDigitalGoSecure (గో డిజిటల్ గో సెక్యూర్ ) అని పేర్కొంది. బ్యాంకు వెబ్‌సైట్ లేదా ఏదేనీ ఈ-కామర్స్ వెబ్‌సైట్ లేదా సెర్చ్ ఇంజిన్ ద్వారా గానీ. బ్యాంక్ వెబ్‌సైట్ మాదిరిగానే థర్డ్ పార్టీ ఫిషింగ్ వెబ్‌సైట్ సృష్టించి బ్యాంకుల ఖాతాదారుల తప్పుదోవ పట్టిస్తారని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్చరించింది. సోషల్ మీడియా, ఎస్సెమ్మెస్, ఇన్‌స్టంట్ మెసేంజర్ ద్వారా ఈ వెబ్‌సైట్ల లింక్‌లను మోసగాళ్లు సర్క్యులేట్ చేస్తూ ఉంటారు.
పలువురు కస్టమర్లు డిటైల్డ్ యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ (యూఆర్ఎల్) తెలుసుకోకుండానే ఈ లింక్‌లను క్లిక్ చేస్తారు. పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పిన్), వన్‌టైం పాస్‌వర్డ్ (ఓటీపీ), పాస్‌వర్డ్ తదితర సెక్యూర్డ్ క్రెడెన్షియల్స్ నమోదు చేస్తారు. వీటిని మోసగాళ్లు వీటిని క్యాప్చర్ చేసేసి.. ఆ బ్యాంకులోని ఖాతాదారుల సొమ్మును స్వాహా చేస్తారని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. గుర్తు తెలియని, ధృవీకరించని లింక్‌లను క్లిక్ చేయొద్దు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే ఇటువంటి ఎస్సెమ్మెస్‌లు, ఈ-మెయిల్స్‌ను తక్షణం డిలిట్ చేయాలి. అన్‌సబ్‌స్క్రైబ్డ్ ఈ-మెయిల్స్ పంపే బ్యాంక్ లేదా ఈ-కామర్స్ లేదా సెర్చ్ ఇంజిన్ లింక్‌లను డిలిట్ చేయడంతోపాటు ఆ ఈ-మెయిల్స్‌ను బ్లాక్ చేయాలి.
ఎల్లవేళలా మీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ లేదా సర్వీస్ ప్రొవైడర్‌కు వెళ్లి చెక్ చేసుకోవాలి. ఫైనాన్సియల్ క్రెడెన్షియల్స్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లను జాగ్రత్తగా వెరిఫై చేసుకున్నాకే వాటిలోకి వెళ్లాలి.
మీకు వచ్చిన ఈ-మెయిల్స్‌లో స్పెల్లింగ్ తప్పులు, మీ యూఆర్ఎల్స్ చెక్ చేసుకోవాలి. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే సంబంధిత బ్యాంకు అధికారికి సమాచారం ఇవ్వాలని కోరింది.
Prathyusha Garimella: ఫ్యాషన్ డిజైనర్ కేసులో సంచలన విషయాలు