గత మూడు వారాలుగా నిలకడగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 121.28 డాలర్లకు పెరిగింది. గత పదేళ్లలో బ్యారెల్ చమురు ధర రికార్డుస్థాయిలో ఇదే అత్యధికం. ముడిచమురు ధర పెరగడం వల్ల ప్రభుత్వ రంగ చమురు కంపెనీల లాభాలపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించి వాహనదారులకు ఉపశమనం కల్పించే ప్రయత్నం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర రూ. 9.50, డీజిల్‌పై రూ.7 తగ్గింది. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం తర్వాత కొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి. ఇందులో రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇండియన్ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం ఈరోజు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
Coal Energy: 4 ఏళ్లలో 81 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గింపు