ఆషాడం వచ్చిందంటే చీరలు సేల్ గురించి మనం వినే ఉంటాం.. అయితే ఇప్పుడు ఇదే బాటలోకి వచ్చింది ప్రముఖ మొబైల్ సంస్థ బిగ్ సీ. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లే ఈ సంవత్సరం కూడా.. ఈ సంస్థ వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటించింది. ప్రతి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుపై రూ.1,999 విలువ చేసే జిజ్‌మోర్ ఇయర్ బడ్స్‌ను కేవలం రూ.99కే ఇవ్వనుంది. అంతేకాకుండా.. రూ.3,999 విలువైన జిజ్‌మోర్ స్మార్ట్‌వాచ్‌ను కేవలం రూ.499కి ఇవ్వనున్నట్లు బిగ్ సీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి ప్రకటించారు. అలాగే స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసేవారికి సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా సులభ వాయిదాల పద్దతిలో తక్షణమే రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
Amazon Primeday : భారీ ఆఫర్లతో రానున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్
ఇలాంటి సేవలు అందిస్తున్న తొలి సంస్థ తమదేనని పేర్కొన్నారు బాలు చౌదరి. వీటితోపాటు ప్రతి స్మార్ట్ టీవీ కొనుగోలుపై రూ.5,199 విలువ కలిగిన ఫింగర్స్ బార్ స్పీకర్‌ను కేవలం రూ.2,999కే ఇవ్వనున్నట్లు బాలు చౌదరి పేర్కొన్నారు. అలాగే ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసిన వారికి ఒక్క ఈఎంఐ, ల్యాప్‌టాప్ బ్యాగ్, యారో హెడ్‌సెట్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు బాలు చౌదరి తెలిపారు.