దేశంలో గత 10 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారం కూడా చమురు ధరలు పెరిగాయి. ఏపీ, తెలంగాణలో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.115.42కి చేరింది. లీటర్ డీజిల్ ధర 87 పైసలు పెరిగి 101.58గా నమోదైంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ 91 పైసలు పెరిగి రూ.114.93గా, లీటర్ డీజిల్ 87 పైసలు పెరిగి రూ.101.10గా ఉన్నాయి. మరోవైపు…
అసలే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో అల్లాడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. సబ్బుల ధరలను పెంచుతూ హిందూస్థాన్ యూనీలివర్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్, పామాయిల్, సోయాబీన్ దిగుమతులపై ప్రభావం పడటంతో సబ్బుల తయారీ కంపెనీలకు నష్టం వాటిల్లుతోంది. ఈ మేరకు పలు సబ్బుల ధరలను 3 నుంచి 7 శాతం మేరకు హెచ్‌యూఎల్ పెంచింది. దీంతో సర్ఫ్ ఎక్సల్, వీల్, రిన్ వంటి డిటర్జెంట్ పౌడర్లతో పాటు డోవ్, లక్స్,…
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని పదిలపరుచుకుని యూజర్లకు మంచి ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ సహాయంతో 2జీబీ వరకు ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం యూజర్లకు వాట్సాప్ అందించనుంది. ప్రస్తుతానికి 100 ఎంబీ కన్నా ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్ షేర్ చేసుకునేందుకు వాట్సాప్‌లో అవకాశం లేదు. దీంతో పెద్ద సైజ్ ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందని…
మార్చి 31తో దేశవ్యాప్తంగా ప్రజలు కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని పనులకు గడువు తేదీని పొడిగించింది. ఈ నేపథ్యంలో మళ్లీ గడువు తేదీని పొడిగించే పరిస్థితులు కనిపించడం లేదు. కావున మరో మూడురోజుల్లో గడువు ముగుస్తుంది కాబట్టి ఈ కింది పనులను పూర్తి చేయకుంటే ఇప్పుడే పూర్తి చేయండి. ★ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి మార్చి 31తో గడువు ముగుస్తోంది. ఆ తర్వాత…
దేశంలో రెండు మల్టీప్లెక్స్ దిగ్గజాలు కలవబోతున్నాయి. పీవీఆర్-ఐనాక్స్ సంస్థలు విలీనం కాబోతున్నాయి. ఈ విషయాన్ని ఆదివారం రెండు కంపెనీలు అధికారికంగా ధ్రువీకరించాయి. అయితే మెక్సికన్ మల్టీపెక్స్ దిగ్గజం సినీపోలీస్కు పీవీఆర్ ట్విస్ట్ ఇచ్చింది. కొన్నిరోజుల కిందట వరకు సినీపోలీస్ను కొనుగోలు చేయాలని పీవీఆర్ ప్రయత్నించింది. అయితే తాజాగా సినీపోలీస్కు హ్యాండ్ ఇచ్చి ఐనాక్స్‌తో పీవీఆర్ సంస్థ చేతులు కలిపింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ సంస్థలు ఒకటి కావాలని నిర్ణయించాయి. కాగా పీవీఆర్-ఐనాక్స్ డీల్ దేశీయ ఫిల్మ్…
దేశవ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్ ధరలు, వంటనూనె ధరలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవి చాలవు అన్నట్లు మనిషి అనారోగ్యం బారిన పడితే కొనుగోలు చేసే ఔషధాల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి పారాసిటమాల్ సహా రోజూవారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు పెరగనున్నట్లు జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్పీపీఏ) ప్రకటించింది. పలు మెడిసిన్స్ ధరలు 10.7 శాతం పెరగనున్నట్లు తెలిపింది. పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో…
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులపై భారం పడుతూనే ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను కేంద్రం పెంచుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు, ఎన్నికలకు సంబంధం లేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా…
దేశవ్యాప్తంగా సుదీర్ఘ విరామం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో సుమారు ఐదు నెలల తర్వాత ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బ్యారెల్ చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇంధన ధరలు పెరగడం ప్రారంభించాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కారణంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ముఖ్యంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోవడంతో భారత్‌లో టోకు విక్రయదారులకు అమ్మే డీజిల్ ధరను లీటరుకు రూ.25 పెంచారు. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర 40 శాతం పెరిగింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర…
ఈనెల 28, 29 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. బ్యాంకింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీల విషయంలో అసంతృప్తిగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మె చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AICBEF), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే అంతకన్నా ముందు మార్చి 26న నాలుగో శనివారం, మార్చి 27న ఆదివారం కారణంగా బ్యాంకులు తెరుచుకోవు.…