ఎప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలతో వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు ఒప్పొ ముందుంటుంది. ఇప్పటికే ఒప్పొ నుంచి వచ్చిన మొబైల్స్, ట్యాబ్లెట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒప్పొ ప్యాడ్ అంటూ ఓ మోడల్‌ను విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా ఒప్పొ ప్యాడ్ ఎయిర్ పేరుతో మరొ కొత్త ట్యాబ్లెట్‌ను చైనా విపణిలోకి విడుదల చేసింది. అయితే.. త్వరలోనే ఈ ట్యాబ్ అమ్మకాలు భారత్‌లో కూడా ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ ట్యాబ్ చూడటానికి చాలా…
ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి విడుదలైన స్కార్పియో ఎస్యూవీ చాలా పాపులర్ అయ్యింది. ఈ ఎస్యూవీ న్యూ జనరేషన్ వెర్షన్ కోసం వాహన ప్రియులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. న్యూ జనరేషన్ మహీంద్ర స్కార్పియో కోసం కస్టమర్ల నిరీక్షణకు తెరపడనుంది. జూన్ 27న రానున్న స్కార్పియో-ఎన్ ఇమేజ్‌లను కంపెనీ విడుదల చేసింది. 2022 మహీంద్ర స్కార్పియోను మహీంద్ర స్కార్పియో-ఎన్గా కస్టమర్ల ముందుకు తీసు రానుంది మహీంద్రా. న్యూ ఎస్‌యూవీతో పాటు…
కరోనా తరువాత మ్యాచువల్ ఫండ్స్ పెట్టుబడులు భారీగా పెరిగినట్లు నివేదక చెబుతున్నాయి. అయితే.. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో హైదరాబాదీలే ఎక్కువ ఉన్నట్లు తాజా సర్వే ప్రకారం తెలుస్తోంది. ఇటీవల పెట్టుబడుల వేదిక ‘గ్రో’ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో హైదరాబాద్‌లోని మదుపరుల్లో 56 శాతం మంది తమ పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ వైపే మళ్లిస్తున్నట్టు వెల్లడైంది. మిగతా మదుపరుల్లోనూ అధికులు స్టాక్స్, ఐపీవోలపైనే ఆసక్తి చూపిస్తున్నారట. 38 శాతం మంది స్టాక్స్‌పై పెట్టుబడులు…
ఎప్పుడూ తమ కస్టమర్లను సంతృప్తి పరచడానికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. అయితే తాజాగా మరో ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన తగ్గింపులను ప్రకటించింది. వీయూ ప్రీమియం 80 సెంటీమీటర్ల(Vu Premium TV 80 cm (32 inch) HD Ready LED Smart TV) టీవీపై భారీ ఆఫర్లు అందుబాటులో తీసుకువచ్చింది ఫ్లిఫ్‌కార్ట్. వీయూ ప్రీమియం టీవీ 80 సెం.మీ (32 అంగుళాల)…
దేశంలో అన్ని ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు పెట్రోల్ ధరలు.. మరోవైపు గ్యాస్ ధరలు సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా ఇప్పుడు సీఎన్జీ గ్యాస్ ధరల వంతు వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో సీఎన్జీల ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కిలో సీఎన్జీపై రూ.2 చొప్పున భారం మోపింది. దీంతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.73.61కి చేరింది. అటు నోయిడాలో రూ.76.71,…
అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇప్పటికే ఇండియాలో ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. కానీ.. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసేందుకు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీం కింద కేంద్రంను అనుమతులు కోరింది ఫోర్డ్. అయితే.. ఇటీవలే ఫోర్డ్ పీఎల్ఐ అప్లికేషన్‌కు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫోర్డ్ మళ్లీ ఇండియాలో కార్ల ఉత్పత్తి కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, భారత్‌లో విద్యుత్ కార్ల తయారీ…
ప్రభుత్వ రంగం, దేశంలోనే అతిపెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఎస్బీఐ. పెద్ద మొత్తం డిపాజిట్ల(రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ)పై వడ్డీ రేటును 40- 90 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లు మినహా అన్ని డిపాజిట్లపై వడ్డీరేట్లను ఎస్బీఐ సవరించింది. పెరిగిన వడ్డీరేట్లు…
ఆన్-డిమాండ్ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో.. వచ్చే రెండేళ్లలో ఒరిజినల్ షోలు, సినిమాలు మరియు కో-ప్రొడక్షన్లలో హిందీ, తమిళంతో పాటు తెలుగులో 40 కొత్త టైటిల్స్‌ను విడుదల చేయనున్నట్లు గురువారం తెలిపింది. భారతదేశంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఈ కంపెనీ, దేశంలోని ప్రైమ్ వీడియో స్టోర్‌తో పే-పర్-వ్యూ మూవీ సర్వీస్‌లోకి అడుగుపెడుతున్నట్లు, అలాగే రానున్న సంవత్సరాల లైసెన్సింగ్, ఒప్పందాలు మరియు వివిధ భారతీయ స్టూడియోలతో కో-ప్రొడక్షన్లను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో హిందీ, తెలుగులో చిత్రాలతో…
గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.450 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,370గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48వేలుగా నమోదైంది. అటు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ.వెయ్యి తగ్గి రూ.69వేలకు చేరింది.…
దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు ముహూర్తం ఖరారైంది. ఎల్ఐసీ ఐపీవో మే 4 నుంచి మే 9 వరకు జరుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీవో ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వం తన 3.5 శాతం వాటాను విక్రయించనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.21వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఐపీవో ఆధారంగా ఎల్ఐసీ సంస్థ విలువ రూ.6 లక్షల కోట్లుగా మారనుంది. అటు ఎల్ఐసీ ఐపీవోలో…