Ola Cabs Fined By Court: 4 కి.మీ. దూరానికి రూ.861 ఛార్జ్ చేసినందుకు రూ.95 వేలు జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ola Cabs Fined By Court: ప్రస్తుత రోజుల్లో ఒక ఫ్యామిలీ బయటకు వెళ్లాలంటే కారు ఉండాల్సిందే. అయితే సొంత కారు లేని వాళ్లు క్యాబ్‌లపై ఆధారపడుతున్నారు. దీంతో ఓలా లేదా ఉబర్ క్యాబ్‌లను బుక్ చేసుకుంటున్నారు. కానీ ఓలా, ఉబర్‌లు సామాన్యులను పిండి పిప్పి చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓలా క్యాబ్స్‌కు హైదరాబాద్ వినియోగదారుల కోర్టు భారీ జరిమానా విధించింది. కేవలం 4-5 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఓ కస్టమర్‌కు ఓలా క్యాబ్స్ ఇటీవల రూ. 861 బిల్లు వేసింది. దీంతో అతడు వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు.
Read Also: Hyderabad: ‘గాంధీ’ సినిమాకు వచ్చి గాంధీగిరి.. థియేటర్ ధ్వంసం చేసిన విద్యార్థులు
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
వివరాల్లోకి వెళ్లే.. 2021 అక్టోబర్‌లో శామ్యూల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి బయటకు వెళ్లేందుకు ఓలా క్యాబ్ ఎక్కాడు. వీళ్లిద్దరూ కేవలం 4-5 కిలో మీటర్లు ప్రయాణించారు. అయితే క్యాబ్ డ్రైవర్ ప్రవర్తన బాగోలేదని , ఏసీ వేయాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని శామ్యుల్ ఆరోపించాడు. అంతేకాకుండా తక్కువ దూరానికి రూ. 861 ఛార్జ్ చేశాడని వివరించాడు. వ్యాలెట్‌లో ఉన్న ఓలా మనీని తీసుకోవడానికి కూడా డ్రైవర్ నిరాకరించాడని.. డబ్బు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశాడని వివరించాడు. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసినా ఓలా యాజమాన్యం తనకు న్యాయం చేయలేదని బాధితుడు శామ్యూల్ తెలిపాడు. దీంతో శామ్యూల్ ఫిర్యాదుపై హైదరాబాద్ వినియోగదారుల కోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కోర్టు ఫీజుల కింద రూ. 7వేలు, నష్టపరిహారం రూ.88వేలు ఇవ్వాలని.. మొత్తం రూ.95 వేలు జరిమానా చెల్లించాలని ఓలాను ఆదేశించింది. అంతేకాదు ఫిర్యాదుదారుడి నుంచి వసూలు చేసిన రూ. 861 ఛార్జీని కూడా 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!