ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగనున్నారు. వారానికి ఐదురోజులే పనిదినాలు ఉండాలని, తమకు పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్లను పరిష్కరించాలంటూ ఈనెల 27న సమ్మె చేయనున్నట్లు 9 బ్యాంకుల యూనియన్ల సంస్థ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటన చేసింది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను ఎత్తివేసి పాత పెన్షన్ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం డిమాండ్ చేశారు. పెన్షనర్లందరి పెన్షన్ల అప్డేషన్, రివిజన్ తమ…
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (IIT-K), క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా మోసానికి సంబంధించిన కేసులను గుర్తించడంలో మరియు ఛేదించడంలో ఉత్తరప్రదేశ్ పోలీసులకు సహాయపడేందుకు దేశీయంగా రూపొందించిన సాధనాన్ని అందజేస్తుంది. ఐఐటీ కాన్పూర్ నుండి ప్రొఫెసర్ సందీప్ శుక్లా మాట్లాడుతూ.. హోప్ (HOP) అని పిలువబడే ఐఐటీ అభివృద్ధి చేసిన సాధనం క్రిప్టోకరెన్సీ లావాదేవీలను విశ్లేషించగలదన్నారు. ఈ సాధనం మిగితా విదేశీ పరికరాల కంటే చౌకైనదని ఆయన వెల్లడించారు. సెప్టెంబరు నాటికి, మా టూల్ యూపీ పోలీసులకు…
దేశంలో గృహ రుణాల లభ్యతను పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సహకార బ్యాంకులు వ్యక్తులకు మంజూరు చేయగలిగే గృహ రుణ పరిమితిని రెట్టింపు స్థాయికి ఆర్బీఐ సడలించింది. ఈ పరిమితిని అర్బన్ సహకార బ్యాంకులకు రూ.75 లక్షల నుంచి రూ.1.40 కోట్లకు పెంచింది. అలాగే గ్రామీణ సహకార బ్యాంకుల్లోనూ రూ.75 లక్షల వరకు గృహ రుణం పొందవచ్చు. ప్రస్తుతం ఇది రూ.30 లక్షలుగానే ఉన్నది. కాగా, అర్బన్ కోఆపరేటివ్…
ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో ఆ డీల్ నిలిచిపోగా.. ట్విటర్‌ను కొనుగోలు చేసేకంటే ముందు మస్క్ ట్విటర్‌పై విమర్శల దాడికి దిగారు. క్రమక్రమంగా ట్విటర్‌ను కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఎలన్ మస్క్ దృష్టి యూట్యూబ్‌పై పడినట్లు చర్చ జరుగుతుంది. దీనికి కూడా కారణం లేకపోలేదు. మస్క్ వరుస ట్వీట్లతో…
దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో ధరల తగ్గింపునకు సంబంధించి అన్ని అవకాశాలను కేంద్రం వినియోగించుకునేందుకు ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రష్యా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ముడి చమురు దిగుమతులను రెట్టింపు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలతో చర్చలు జరుపుతోంది. రానున్న ఆరు నెలల పాటు ముడి చమురు సరఫరా కోసం ఒప్పందం చేసుకునేందుకు దేశీయ చమురు సంస్థలు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.…
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు బుధవారం పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర క్రితంరోజుతో పోలిస్తే రూ.100 పెరిగింది. ప్రస్తుతం రూ.52,600 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.400 వరకు పెరిగింది. ప్రస్తుతం రూ.63,900కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. RBI Repo Rate: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మరో సారి వడ్డీ రేట్లు పెరిగాయ్.. హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం…
భారత వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రపంచ బ్యాంకు మరోమారు తగ్గించింది. 8.7 శాతం వృద్ధిరేటు లభిస్తుందని ఈ ఏడాది జనవరిలో అంచనా వేసిన ప్రపంచబ్యాంక్, దానిని 8 శాతానికి సవరిస్తున్నట్లు ఏప్రిల్‌లో పేర్కొంది. వృద్ధిరేటు అంచనాలను 7.5 శాతానికి పరిమితం చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంటే జనవరి నాటి తొలి అంచనాలతో పోలిస్తే వృద్ధిరేటు అంచనాలను 1.2 శాతం మేర ప్రపంచ బ్యాంక్ తగ్గించినట్లయ్యింది. 2023-24లో వృద్ధిరేటు మరింత నెమ్మదించి 7.1…
దేశంలో మొబైల్ వాడేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో తమకు నచ్చిన, అందుబాటులో ఉండే నెట్‌వర్క్‌ను మొబైల్ యూజర్లు ఎంచుకుంటున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే మార్కెట్లో బాగా పోటీపడుతున్న జియో, ఎయిర్‌టెల్‌కు తోడుగా ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా పలు ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా కేవలం రూ.100 కన్నా తక్కువగా ఉండే మూడు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ.87 ప్లాన్: బీఎస్ఎన్ఎల్ తెచ్చిన రూ.100లోపు ప్లాన్లలో ఇది తక్కువ. ఎంతోమంది యూజర్లకు ఈ…
వారం క్రితం భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. హైదరాబాద్‌లో సోమవారం నాడు లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు పెరిగి రూ.109.83కి చేరింది. లీటర్ డీజిల్ 16 పైసలు పెరిగి రూ.97.98కి చేరింది. మరోవైపు ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 11 పైసలు తగ్గి రూ.111.92గా నమోదైంది. లీటర్ డీజిల్ 9 పైసలు తగ్గి రూ.99.65కి చేరింది. Credit Card: డెబిట్ కార్డ్ కంటే క్రెడిట్ కార్డ్ ఉత్తమమా..? కాగా 10…
దేశీయ స్టాక్ మార్కెట్ బిగ్బుల్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు తక్కువ ఖర్చుకే విమాన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ‘ఆకాశ’ విమానయాన సంస్థను ఝున్‌ఝున్ వాలా ప్రకటించారు. విమానయాన రంగంలో రూ.262 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా వచ్చే నెలలో ఆకాశ విమానాలు టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఆకాశ విమానాలకు సంబంధించిన ఫోటోలను కంపెనీ షేర్ చేసింది. ఆకాశ ఎయిర్‌లైన్స్ సంస్థ జూన్‌లో ముంబైలో తన…