One Man Two Jobs: ఒక ఉద్యోగి రెండు సంస్థల్లో పనిచేయటం సరికాదని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. అది మోసంతో సమానమని అభిప్రాయపడ్డారు. మూన్‌లైటింగ్‌గా పేర్కొనే ఈ పథకానికి ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విప్రో చైర్మన్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ విషయంలో సంప్రదాయ టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్‌లు రెండుగా చీలిపోయాయనటానికి ఇదో నిదర్శనమని చెప్పొచ్చు.
మరిన్ని ఐకియా స్టోర్లు
స్వదేశీ ఫర్నీచర్ రిటైలర్ ఐకియా.. మెగా ఫార్మాట్ స్టోర్లతోపాటు స్మాల్ సిటీ ఔట్‌లెట్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసింది. ఈ స్మాల్ సిటీ ఔట్‌లెట్లకు అనుబంధంగా ఆన్‌లైన్ చానల్‌ని కూడా అందుబాటులోకి తేనుంది. వినియోగదారుల అవసరాలకు, ఆలోచనలకు అనుగుణంగా తన వ్యాపార వ్యూహాలను మార్చుకుంటోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐకియాకి ప్రస్తుతం 10 స్టోర్లు ఉండగా మరో 15 స్టోర్లను ఓపెన్ చేయాలని చూస్తోంది.
KTR On Bandi Sanjay: అమిత్ షాకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా ?
టాప్‌లో రష్యా
చైనాకు చమురును సరఫరా చేసే దేశాల్లో వరుసగా 3వ నెలలోనూ రష్యా టాప్‌లో నిలిచింది. ఈ విషయాన్ని చైనీస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ విడుదల చేసిన జులై నెల డేటా వెల్లడిస్తున్నట్లు మీడియా పేర్కొంది. రష్యా నుంచి తక్కువ రేటుకే చమురు లభిస్తుండటంతోపాటు చైనా తన పోటీ దేశాలైన అంగోలా, బ్రెజిల్ నుంచి షిప్‌మెంట్లను తగ్గించుకోవటం దీనికి ప్రధాన కారణాలని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సీబీడీసీకి మార్గం
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని దశలవారీగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందుబాటులోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. సీబీడీసీని ముందుగా హోల్‌సేల్ బిజినెస్‌లలోనే వినియోగించేందుకు అనుమతించనుంది. కేవైసీ ఇవ్వని కస్టమర్లు ఈ నగదును వాడుకోకుండా ఉండేందుకు దీనికి పక్కాగా డిజైన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
భారీ నష్టం
గత వారం జరిగిన మార్కెట్ వ్యాల్యుయేషన్‌లో టాప్-10లోని 5 కంపెనీలు 30 వేల కోట్ల రూపాయలకు పైగా క్యాపిటలైజేషన్‌ను కోల్పోయాయి. ఈ 5 సంస్థల్లో ముఖ్యంగా రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువగా నష్టపోయింది. ఈ జాబితాలో రిలయెన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ తదితర కంపెనీలు ఉన్నాయి.
‘హువాయ్’ క్లోజ్
చైనాకు చెందిన దిగ్గజ టెలికం సంస్థ హువాయ్.. ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలను తగ్గించనుంది. బెంగళూరులోని ఆర్ అండ్ డీ క్యాంపస్‌ను మూసివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్‌కం ట్యాక్స్ దాడులు, 5జీ స్పెక్ట్రం వేలం నుంచి మినహాయించటం, రీసెర్చ్ కొలాబరేషన్లపై ఆంక్షలు పెరగటం తదితర కారణాలతో హువాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.