High end Features in mahindra xuv 400
దేశంలో ఇంధనం ధరలు రోజు రోజుకు పెరిగిపోతునన్న నేపథ్యంలో.. అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రముఖ వాహన తయారీ సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు వినూత్న డిజైన్లతో వాహనాలను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. అయితే.. ఇండిపెండెన్స్ డే నాటి స్పెషల్ ఈవెంట్‌లో అదిరిపోయే ఫీచర్స్‌తో మహీంద్రా ఎక్స్‌యూవీ 400 లాంచింగ్‌డేట్‌ను ప్రకటించింది మహీంద్రా సంస్థ. మహీంద్రా అండ్ మహీంద్రా 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో ఎక్కువగా టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్ కారు అమ్ముడుపోతోంది. ఇందులోని ఫీచర్స్ వినియోగదారులను కట్టిపడిచేస్తున్నాయి. అయితే.. ఈ కారుకు మించి అంతకుమించి అనేవిధంగా.. మహీంద్రా ఎక్స్‌యూవీ 400ను బరిలోకి దింపనుంది మహీంద్రా సంస్థ.
అయితే ఇప్పటికే మహీంద్రా నుంచి REVAi, e2o ,eVerito కార్లు వచ్చినా.. అంతా వినియోగదారులను సంతృప్తి పరచలేదు. అయితే.. ఇప్పుడు మహీంద్రా నుంచి వస్తున్న ఈ ఈవీ వెహికల్‌లో 150హెచ్‌పీ శక్తిని అందించే ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్, రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు. ఎక్స్‌యూవీ 700 మాదిరిగా క్యాబిన్ లోపల, Adreno X ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ADAS, తదితర ఫీచర్లతో రాబోతుందని తెలుస్తోంది. అయితే ఎక్స్‌యూవీ 400 కార్ల డెలివరీ మాత్రం అక్టోబర్‌లో మొదలు కానున్నట్లు సమాచారం. ఈ కారును 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది మహీంద్రా కంపెనీ.