దమ్ముంటే బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలని సవాల్ విసిరారు ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీజేపీ రైతు అంశంపై కనీస అవగాహన లేకుండా ధర్నాలు చేస్తోందని… నిన్నటి వరకు 3550 కొనుగోలు కేంద్రాలను తెరిచామన్నారు. అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని…. కొన్న పంటలకు డబ్బులు రైతులకు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు సోయి- జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని.. కనీస జ్ఞానం లేని వ్యక్తి బీజేపీ పార్టీ రాష్ట్ర…
ఇటీవలి లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి నిరాశ మిగిల్చాయి. మోడీ ప్రభుత్వ వ్యతిరేకతకు ఈ ఫలితాలు అద్దంపడుతున్నాయి. పెట్రో ధరలు. రైతు ఆందోళనలు.. నిరుద్యోగం. తగ్గిన మోడీ గ్రాఫ్. ఈ అంశాలన్నీ ప్రభావం చూపాయనటంలో అనుమానం లేదు. మామూలుగా అయితే ఈ ఫలితాలను బీజేపీ పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ కొన్ని నెలల వ్యవధిలో పలు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఈ వ్యతిరేకత కంటిన్యూ అయితే కష్టాలు…
యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారింది పరిస్థితి.. ఈ వ్యవహారంలో కేంద్రంపై సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్లో కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర బీజేపీ నేతల వరకు అంతా కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో.. కేంద్రం వైఖరి ఏంటి? రాష్ట్ర విధానం ఏంటి? అనే దానిపై గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది.. అయితే, యాసంగి ధాన్యం కొంటామని బీజేపీ నేతలు అధికారికంగా ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్ చేశారు…
బీజేపీలో ఈటెల స్థానం ఏంటి? సముచిత గౌరవం దక్కుతుందా? సీనియారిటీకి తగ్గ గుర్తింపు లభిస్తుందా? ఇప్పుడు ఇలాంటి చర్చే మొదలైంది. సీనియారిటీకి తగ్గట్టే ఈటలకు పదవీ దక్కుతుందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇంతకీ ఈటెలకోసం బీజేపీ సిద్ధం చేస్తున్న ఆ కుర్చీ ఏంటి? ఇప్పటికే ఆ కుర్చీలో కూర్చున్నవారి పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్ నుంచి ఎంత వేగంగా బయటకొచ్చారో.. అంతే వేగంగా బీజేపీలో చేరిపోయారు ఈటల రాజేందర్. అధికార పార్టీని ఢీ కొట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం…
ఇవాళ ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈటల రాజేందర్. స్పీకర్ కార్యాలయంలో ఈటల రాజేందర్ ప్రమాణం చేయనున్నారు. కాగా… భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి మే మాసంలో బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అంతేకాదు… ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం బీజేపీ లో…
రాష్ట్ర ప్రభుత్వం ధరలను ఎందుకు తగ్గించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశం లోని చాలా రాష్ట్రాలు పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గిస్తే వైసీపీ మాత్రం ధరలు తగ్గించే విషయంలో మొండిగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. ధరలు తగ్గించాలని కోరితే మంత్రులను బూతులు తిట్టడ మేంటని ఆయన జగన్ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్రం ధరలు తగ్గించి ఉపశమనం కలిగించినా రాష్ట్రం ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయదని ఆయన మండిపడ్డారు. రూ. 25…
భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గానికి నిర్వహించి ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై ఈటల రాజేందర్ గెలుపొందారు. అయితే రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ కార్యాలయంలో ఈటల రాజేందర్ ప్రమాణం చేయనున్నారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం…
ఒకప్పుడు సరైన సమయంలో వర్షాలు కురియక రైతులు ఆందోళన చెందేవారు. ఒక్కోసారి అతి వర్షాలు కురిసి పంటకు నష్ట వాటిల్లేది. ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్న రైతులు ఎప్పుడూ వినని మాటలు రాజకీయ నాయకుల నోటి నుంచి వింటున్నారు. ఆ మాటలతో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. ఓ రాజకీయ పార్టీ అధినేత వరి వేస్తే ఊరే అంటే.. మరో రాజకీయ పార్టీ నేత వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తానంటున్నారు.. ఇలా రాజకీయ…
కేసీఆర్‌ది రెండు నాల్కల ధోరణి అంటూ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేసీఆర్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నల్లగొండలో ఆయన మాట్లాడుతూ..హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమితో.. కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయిందన్నారు. బీజే పీ, టీఆర్ఎస్పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని, బీజేపీతో టీఆర్ ఎస్ లాలూచీ పడిందన్నారు. రైతాంగం దివాలా తీసిన తర్వాత కేసీ ఆర్ ఢిల్లీ పోతాడా..? ఢిల్లీ వెళ్లి నిరాహారదీక్షపై స్పష్టత లేదు. మీరు, మేం కలిసి ధర్నా చేద్దాం రండి…
వడ్ల సేకరణ విషయంలో కేంద్రానిది ఘోర వైఫల్యమని, పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లు కేంద్రం ఎందుకు కొనదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి వడ్ల సేకరణ విషయంలో కేంద్రానికి స్పష్టత లేదన్నారు. యాసంగి వడ్లను బాయిల్డ్ రైస్ కోసం ఇప్పటి వరకు కేంద్రం ప్రోత్సహించి ఇప్పుడు చేతులెత్తే సిందన్నారు. కేంద్రం బాయిల్డ్ రైస్‌కు ప్రోత్సామం ఇచ్చినందునే దేశంలో ఎన్నో మిల్లులు ఏర్పడ్డాయన్నారు. ఏడేళ్లుగా…