ఎమ్మెల్సీ కోడ్ వల్లే సమావేశాలు నిర్వహించలేదు: గద్వాల విజయలక్ష్మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వల్లనే కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేకపోయామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్మీ అన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఇవాళ బీజేపీ ధర్నాకు దిగింది. వారు మేయర్ ఛాంబర్లోకి వెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. జనరల్ బాడీ మీటింగ్, పెట్టాలని ప్రజా సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనిపై మేయర్ విజయ లక్ష్మీ మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా వర్చువల్ సమావేశాలు నిర్వహించామని, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సమావేశం నిర్వహించలేకపోయామని అన్నారు.
కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోయినా నా వద్దకు నేరుగా వచ్చి ఏదైనా అడగొచ్చు అన్నారు. కార్యాలయానికి వచ్చి కుర్చీలు ధ్వంసం చేయడం సరికాదని ఆమె అన్నారు. జీహెచ్ఎంసీలో సొమ్ము మేయర్ సొమ్ము కాదని, అది ప్రజల సొమ్ము అని ఆమె అన్నారు. అధిష్టానం సూచన మేరకే బీజేపీ కార్పొరేటర్లు విధ్వంసానికి దిగారా? ఎవరి ఆదే శాల మేరకు వారు ధర్నాకు సిద్ధమయ్యారో తెలియదన్నారు. జీహెచ్ ఎంసీలో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ లో జీహెచ్ఎంసీకీ 13 అవార్డులు వచ్చాయి. కార్పొరేటర్లకు క్షేత్ర స్థాయిలో ఉండే సమస్యలు నాకు తెలుసు. పార్టీలకు అతీతంగా వచ్చి అడిగితే పనులు చేస్తున్నాం అని మేయర్ విజయలక్మీ తెలిపారు.
Also Read
- Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
- Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై 'ఈగిల్ ఫోర్స్' ఉక్కుపాదం
- Hyderabad Rains: రెండు నెలల తర్వాత హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్
తాజావార్తలు
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!