ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హిట్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే కరీంనగర్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటా పోటీగా నామినేషన్లు వేస్తున్నారు. అక్కడ ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఇప్పటికే 14 మంది అభ్యర్థుల తరపున 22 నామినేషన్లు దాఖలు చేసారు. ఇప్పటివరకు 13 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయుటకు ఆసక్తి చూపించారు. అయితే నేడు తెరాస తరపున ఎల్ రమణ, బానుప్రసాద్ నామినేషన్ వేయనున్నారు. ఈరోజు నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కావడంతో నామినేషన్లు సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. అయితే నేడు ముగిసే నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువు ఉంది. అప్పటివరకు ఎవరైనా అభ్యర్థులు తమ నామినేషన్ ను వెన్నకి తీసుకోవచ్చు.