కేంద్రం మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేం దుకే కేసీఆర్ కొత్త నాటకానికి తెర లేపారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ పై నిప్పులు చెరిగారు. మాట మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ రాష్ర్ట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం పై అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఆయన మండి పడ్డారు. ఓ వైపు వరి ధాన్యం మొత్తం మేమే కొంటామని చెప్పి ఇప్పుడు ఆ నెపంను కేంద్రం పై తోస్తున్నారన్నారు. యాసంగి లో వరి వేస్తే ఉరి అని కేసీఆర్ చెప్పడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదని ఆయన విమర్శించారు.
రాష్ర్టంతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతి గింజను కేంద్రం కొంటుందని ఆయన స్పష్టం చేశారు. రైతు చట్టాలపైన కేసీఆర్ విషం కక్కారని ఎద్దేవా చేశారు. మొదట రైతుల కోసమని చెప్పి ఇప్పుడు రైతులను దోచుకునేందుకు కేంద్రం చట్టాలను చేసిందని ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశాడని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోజార్టీ రైతులు చట్టాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉండటంతోనే మోడీ రైతు చట్టాలను వెనక్కు తీసుకున్నారన్నారు. పంజాబ్ రైతులకు పరిహారం ఇవ్వడంలో తప్పులేదని, కానీ తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read
- Tags
- bjp
- Farmers
- kcr
- KishanReddy
- TRS
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!