తండ్రి, కొడుకులు తెలంగాణ ద్రోహులే: మాజీ మంత్రి చంద్ర శేఖర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్, కేటీఆర్ తండ్రీ కొడుకులు ఇద్దరూ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహులేనని మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్ర శేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే కేటీఆర్ ఉలిక్కి పడుతున్నాడన్నారు. తెలంగాణ రైతులను ఆదు కొమ్మంటే, పంజాబ్ రైతులకు రూ.3 లక్షలు ఇస్తా అంటు న్నాడని ఎద్దేవా చేశారు. ఈ 7 ఏళ్లలో మీ అసమర్థ పాలన వల్ల, మీరు చేసిన ద్రోహం వల్ల వేల మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాల వైపు కనీ సం కన్నెత్తి చూడలేదన్నారు. మీరు ఎక్కడో ఢిల్లీ ధర్నాలో రైతులు చని పోయారట… వాళ్ళ కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తారట ఇక్కడ ఉన్న రైతులను పట్టించుకోరా అంటు ఆయన ప్రశ్నించాడు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నడట అంటూ విమర్శించారు.
ఈ నెల రోజుల్లో వడ్ల కుప్పల పై 6 గురు రైతులు చనిపోయారు. ఆ రైతు కుటుంబాలకు ముందుగా రూ.25 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వరి వేస్తే ఉరే అని మీ నాన్న చేసిన మూర్ఖపు కామెంట్స్ తో 5 గురు వరి రైతులు గుండెపోటుతో చనిపోయారని కేటీఆర్ ఉద్దేశించి చంద్రశేఖర్ అన్నారు. 1400 మంది అమర వీరుల త్యాగాలపై మీ కుటుంబం భోగాలు అనుభవిస్తోంది. కనీసం 600 మం దికి కూడా సాయం అందలేదు. ఆ అమరుల కుటుంబాలకు ముందుగా ఆర్థిక సాయం అందించాలన్నారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
ఉద్యోగాలు రాక వంద మందికి పైగా నిరుద్యోగ యువత ఆత్మ హత్య చేసుకుంది. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలన్నారు. నిరుద్యోగ యువకులకు రెండేళ్ల నుంచి బాకీ ఉన్న నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవన్నీ అమలు చేశాక ఉత్తరాది రైతులకు సాయం చేస్తా అన్నా మాకేమి అభ్యంతరం లేద న్నారు. కానీ ఇక్కడి రైతుల చావుకు మీరే కారణమవుతూ ఎక్కడో ఢిల్లీ లో రైతుల పై ప్రేమ ఒలకపోస్తాం అంటే తెలంగాణ రైతులు చూస్తూ ఉరుకోరని, రాళ్లతో కొట్టి తరుముతారని చంద్రశేఖర్ అన్నారు
- Tags
- bjp
- chandra shekar
- Farmers
- kcr
- ktr
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..