తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై డీకే ఆరుణ కీలక ఆరోపణలు చేశారు. దళిత బంధు, హుజురాబాద్ ఎన్నికల విజయం నుంచి ప్రజల దృష్టిని మరళ్లించేందుకు రైతు ధర్నాలు, ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రైతు చట్టాలపై కేంద్రం మెడలు వంచుతా అని మాట్లాడుతున్న కేసీఆర్ తన మాట తీరును మార్చుకోవాలని సూచించారు. ఓట్లు, సీట్లు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం కేసీఆర్‌కు లేదని డీకే అరుణ ఆరోపణలు చేశారు.
Read: కొన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ బిల్లు పెట్టాం: జగన్
తెలంగాణ రాష్ట్రంలో రైతులు చనిపోతుంటే, నష్టపరిహారం ఇవ్వాలనే సోయికూడా ముఖ్యమంత్రికి లేదని, పక్కరాష్ట్రాల్లో మృతి చెందిన రైతులకు 3 లక్షల పరిహారం ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని, కన్నతల్లికి అన్నం పెట్టని కొడుకు చిన్నమ్మకు బంగారు గాజులు చేపించినట్టు ఉందని అన్నారు. ఉద్యోగం లేక ఆత్మహత్యకు పాల్పడ్డ నిరుద్యోగ యువత సమస్యను గాలికి వదిలేశారని బీజేపీ నేత విమర్శించారు.