మూడు రాజధానుల ఉపసంహరణ నిర్ణయం ప్రభుత్వ విధాన నిర్ణయంగా భావిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా రాజధాని అభివృద్ధికి బీజేపీ నిబద్ధతతో ఉందని సోము వీర్రాజు తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. రాయలసీమ వెనుకబాటు తననానికి ఆ ప్రాంత పాలకులే కారణమని ఆయన అన్నారు. నేతలు వనరులను దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
పర్సంటేజీల కోసం ప్రాజెక్టుల గురించి మాట్లడుతారు కానీ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజాక్షేమం గురించి ఆలోచించాలని ఆయన అన్నారు.రాయలసీమ వాసులు కూడా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారని ఆయన పేర్కొ న్నారు. ప్రభుత్వం రాజధానుల విషయంలో మంచి నిర్ణయం తీసు కుందన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్ణ యం తీసుకున్నారని, కానీ ఇది ఏదో ఈ మూడు రాజధానులను ప్రక టించినప్పుడే తీసుకుని ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయ పడ్డారు. అప్పుడే ప్రకటించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని సోము వీర్రాజు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.