పేపర్ లిక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్కు సిట్ రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ఇచ్చిన సిట్ నోటీసులు తనకు రాలేదని, సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి మీడియా కథనాల ద్వారా తెలిసిందని చెప్పడంతో..నిన్న సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని తెలిపారు. అయితే సిట్ నోటీసులకు బండిసంజయ్ స్పందించారు.
Swara Bhasker: అనర్హత వేటు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీకి బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ మద్దతుగా నిలిచారు. పప్పు అని విమర్శిస్తున్నవారు ఆయనకు ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ్యుడిగా అనర్హత వేటు వేయడంపై ట్వీట్ చేస్తూ.. చట్టాన్ని దుర్వినియోగం చేశారని వ్యాఖ్యానించారు. ఆయనను డిస్ క్వాలిఫై చేయడానికి చట్టాలను దుర్వినియోగం చేశారని అన్నారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువునష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే.. ‘‘ప్రజాప్రాతినిధ్య చట్టం-1951’’లోని సెక్షన్ 8(3) ప్రకారం అనర్హత వేటు పడుతుంది. అయితే తాజాగా ఆయన తన ట్విట్టర్ బయోలో మార్పులు చేశారు. "డిస్ క్వాలిఫై ఎంపీ" అంటూ ప్రొఫైల్ లో మార్పులు చేశారు.
కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శనివారం దావణగేరేలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే హఠాత్తుగా ఓ వ్యక్తి ప్రధాని కాన్వాయ్ దగ్గరకు పరిగెత్తుతూ వెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కర్ణాటక హుబ్బళ్లి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇలా ప్రధాని పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరగడం ఇది రెండోసారి. మోదీకి దగ్గరగా వెళ్లాలనుకున్న వ్యక్తని…
TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఈ కేసుకు సంబంధించిన సిట్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హాజరు అవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథపై వివాదం మరింత వేడెక్కింది. తోటి విద్యార్థులను దూషించి కొడుతున్న రెండు వీడియోలు బయటకు రావడంతో రాజకీయ దుమారం రేగింది.