సీబీఐ-ఈడీ దాడులు అవినీతిపరులందరినీ ఒకే రాజకీయ పార్టీలోకి తీసుకొచ్చాయని, కేంద్రంలో బీజేపీ పాలన ముగియగానే దేశం అవినీతి రహితంగా మారుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆరోపించారు.
Karnataka: కర్ణాటక ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న పోలింగ్ నిర్వహించి మే 13న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చిపడింది. మంగళవారం మాండ్యాలో ప్రచారం చేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నోట్లను వెదజల్లడం జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఒక రోజు ముందు ఈ ఘటన జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్…
KCR అంటే సిద్దిపేట.. సిద్దిపేట అంటే KCR మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా హాజరయ్యారు.
Rajeev Gowda: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. మే 10న పోలింగ్ జరగనుండగా.. 13వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కర్ణాటక నుంచే బీజేపీ ఓటమి ప్రారంభం అవుతుందంటున్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. బీజేపీ ఓటమి ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. 2024 ఎన్నికల తరువాత కాంగ్రెస్ విజయం ఖాయం.. మాజీ ప్రధానిగా మోడీ మారడం…
దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు సిద్ధమవుతున్నారు. హిందువులందరూ కలిసికట్టుగా ఎంతో అంగరంగ వైభవం గా జరుపుకునే పండుగల్లో శ్రీరామ నవమి. ఎక్కడ చూసిన శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే, శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా కొందరు బీజేపీ నేతలు అతి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తునున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ బీజేపీ నేత మాంసం దూణాకాల వద్ద హల్ చల్ చేశాడు. నవరాత్రుల సందర్భంగా గోసంరక్షకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక…
PM Narendra Modi: బీజేపీ మాత్రమే పాన్ ఇండియా పార్టీ అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయ సంస్థ నుంచి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగేందుకు పార్టీ కార్యకర్తల అంకితభావం, త్యాగాలే కారణం అని ఆయన అన్నారు. కుటుంబ నియంత్రణలో ఉన్న పలు రాజకీయ పార్టీ మధ్య బీజేపీ మాత్రమే పాన్ ఇండియా పార్టీ అని అభివర్ణించారు. బీజేపీ అత్యంత భవిష్యత్ వాద…
Uddhav Thackeray: రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో ప్రస్తుతం పరువునష్టం కేసు జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ దొంగలందరికి మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ క్రిమినల్ పరువు నష్టం కేసు వేయగా..ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడటమే కాకుండా.. ఎంపీగా అనర్హత వేటు…