బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. గుజరాత్ లో ఎందుకు ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎకరాకు 10 వేల నష్ట పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్, రైతు బిడ్డ అని మరోసారి నిరూపించారని ట్వీట్ చేశారు.
టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి లీగల్ నోటీసులు పంపడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ బీజేపీకి కొత్త చీఫ్‌గా సీపీ జోషి ఎన్నికయ్యారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం.. పోలవరం నీటి నిల్వపై లోకసభలో సమాధానం ఇచ్చారు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్.. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని తేల్చిచెప్పారు.. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం.. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకే క్లారిటీ వచ్చింది కేంద్రం.. తొలిదశ సహాయ, పునరావాసం…
దేశంలో బీజేపీ బలోపేతం కొత్త వ్యూహాన్ని అమలు చేసింది. పలు రాష్ట్రాలకు కొత్త పార్టీ చీఫ్‌లను నియమించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ తన ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ రాష్ట్ర యూనిట్లకు కొత్త చీఫ్‌లను గురువారం నియమించింది.
Modi Surname Case: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు చెప్పింది. 2019లో ‘‘మోదీ ఇంటిపేరు’’ వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో శిక్షను ఎదుర్కోనున్నారు. శిక్ష విధించిన తర్వాత సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 30 రోజుల బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతకుముందు రోజు సూరత్ కు వచ్చిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
Media persons Protection Bill: జర్నలిస్టుల రక్షణ కోసం చత్తీస్ గఢ్ ప్రభుత్వం ‘ ఛత్తీస్‌గఢ్ మీడియా పర్సన్స్ ప్రొటెక్షన్ బిల్లు 2023 ’ను తీసుకువచ్చింది. బుధవారం ఆ రాష్ట్ర శాసనసభలో దీన్ని ఆమోదించారు. ఇది చారిత్రాత్మక రోజు అని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అభివర్ణించారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా.. స్పీకర్ చరదాస్ మహంత్ తిరస్కరించారు. ఛత్తీస్‌గఢ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో…
Tipu Sultan: టిప్పు సుల్తాన్ ను ఎవరు చంపారు..? ఇప్పుడు కర్ణాటకలో మరో వివాదం ముందుకు వచ్చింది. కర్ణాకటలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి వీడీ సావర్కర్ వర్సెస్ టిప్పు సుల్తాన్ గా రాజకీయం కొనసాగుతోంది. బీజేపీ సావర్కర్ పేరుతో ఇతర పార్టీలపై విమర్శలు చేస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ వొక్కలిగ వర్గాన్ని దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది.