ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తామని, కేసులు, జైళ్లు మాకు కొత్త కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి నిరసనగా ‘‘మా నౌకరీలు మాగ్గావాలే’’ నినాదంతో బీజేపీ తలపెట్టిన ‘‘నిరుద్యోగుల మహాధర్నా’’కు ఉన్నత న్యాయ స్థానం అనుమతి ఇచ్చింది.
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్కి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాల బండి సంజయ్ ఇంటికి వెళ్లిన సిట్ ఇన్ స్పెక్టర్ అందజేశారు. రేపు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్పీసీ 91 కింద నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో సిట్ పేర్కొన్నారు.
Karnataka: కర్ణాటక ఎన్నికల ముందు అక్కడి అధికార బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లలో 4 శాతం ముస్లిం కోటా రిజర్వేషన్లను రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లను 56 శాతానికి పెంచింది. ముస్లింలకు 4 శాతం ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ముస్లింలు 10 శాతం ఆర్థికంగా బలహీన విభాగం(ఈడబ్ల్యూఎస్) కేటగిరిలో రిజర్వేషన్ పొందే అవకాశం మాత్రమే ఉంటుంది. ముస్లింల 4 శాతం కోటాను ఇప్పుడు వొక్కలిగా, లింగాయత్ లకు ఇవ్వనున్నారు.
పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను భారత్ స్వరం కోసం పోరాడుతున్నానని.. ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించేలా చేసిన వ్యాఖ్యకు పరువునష్టం కేసులో దోషిగా తేలిన ఒక రోజు రాహుల్పై అనర్హత వేటు పడడం గమనార్హం.
లోక్సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, రాహుల్ కోసం పోరాటం చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.