బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన రద్దయింది. మార్చి 31న జేపీ నడ్డా సంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసును ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని జేపీ నడ్డా ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. జేపీ నడ్డా పర్యటనలో స్వల్ఫ మార్పు జరిగినట్లు తెలంగాణ బీజేపీ నేతలు వెల్లడించారు. ఢిల్లీ నుండే నేరుగా వర్చువల్ ద్వారా సంగారెడ్డి కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్కడి నుండే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు జేపీ నడ్డా.
Also Read : Pawan Kalyan : రాష్ట్రంలో రైతులు కష్టాలు మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి
ఈ నేపథ్యంలో.. సంగారెడ్డి కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ లతో పాటు శివప్రకాశ్ జీ, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ పాల్గొన్ననున్నారు. సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో యధావిధిగా రాష్ట్ర పదాధికారుల, జిల్లా నేతల సమావేశం కొనసాగనుంది. అలాగే.. భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలను సైతం జేపీ నడ్డా వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయాల్సిందిగా సంబంధిత నాయకులు, కార్యకర్తలను కోరారు.
Also Read : Howrah Ram Navami clashes: హౌరా రామనవమి ఊరేగింపులో అల్లర్లు.. టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం..