ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. త్వరలోనే ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. అంతేకాకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలన్న సీఎం కేసీఆర్ మద్దతు తప్పనిసరి అని కీలక వ్యాఖ్యలు చేశారు.
మణిపూర్లో జాతి హింసపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. కాంగ్రెస్ మణిపూర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ బీరెన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మణిపూర్లో శాంతిస్థాపన దిశగా ఉద్యమం ఉండదని కాంగ్రెస్ ఆదివారం పేర్కొంది.
తెలంగాణలో కార్మిక హక్కులను బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు గాంధీభవన్ ప్రకాశం హాల్ లో జరిగిన అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ సమావేశంలో భట్టి విక్రమార్క, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమకు కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ బీజేపీ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన మణిపూర్ ఘటనను ఖండించిన ఛటర్జీ.. మణిపూర్లో ఏర్పడిన పరిస్థితి పశ్చిమ బెంగాల్లో కూడా ఉందని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిసి ప్రతిపక్షంగా కలిసి పనిచేయాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఈరోజు ప్రకటించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మణిపూర్ సంక్షోభంపై కేంద్రంపై విమర్శలు గుప్పించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ 'బేటీ బచావో' పథకం ఇప్పుడు 'బేటీ జలావో' (మా కుమార్తెలను కాల్చండి)గా మారిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి రోజురోజుకు ఓటు బ్యాంక్ పెరుగుతుందని తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ లేని చోట్ల అధికార మదం, డబ్బు మదంతో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది.. అంతేకానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా గెలవలేదు.. అసలు ఆ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యనించారు.