తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 3వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ మీటింగ్ లో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు అస్త్రాలను సిద్దం చేసుకోంటున్నాయి.
MP Komatireddy: ఏళ్లు గడుస్తున్నాయే గానీ హామీని నిలబెట్టుకోలేదని సీఎం కేసీఆర్ కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈనెల 29వ తారీఖున ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు వెల్లడించారు. అయితే, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పర్యటించారు. గజ్వేల్ అల్లర్లలో జైలుకు వెళ్లిన వారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దుర్మార్గానికి పాల్పడిన వారిని శింక్షించకుండా హిందువులను జైలుకు పంపించి మరో వర్గానికి కొమ్ము కాస్తున్నారు అని మండిపడ్డారు.
Kishan Reddy: చేతల ప్రభుత్వం మోడీ ది అని, దేశంలో విద్యుత్ కొరత లేకుండా చేసిన ఘనత మోడీ దే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అన్నారు.
కేంద్రంపై లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ ప్రతిపక్షాలు బుధవారం నోటీసులు ఇవ్వగా, ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రధాని మోడీ నాలుగేళ్ల క్రితమే ఊహించారు. 2019లో అలాంటి తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.