కర్ణాటక అసెంబ్లీ నుండి 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సభలో అసభ్యకరంగా, అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు వారిని డిప్యూటీ స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం.. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురి కావాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు.
బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్, కేంద్రమంత్రి మురళీధరన్‌తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లారు.
భారతీయ జనతా పార్టీ, విపక్ష పార్టీలు కానీ ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. దళితులు, ముస్లింలు, మైనార్టీల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేయలేదని ఆమె అన్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే.. అధికారంలోకి రాగానే.. వాళ్లు ఇచ్చిన వాగ్థానాలను మరిచిపోతారని బీఎస్పీ చీఫ్ ఆరోపించారు.
సిద్దాంతపరంగా భావజాలం కుదరని పార్టీలతో విపక్షాల కూటమి ఏర్పడిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీని ఓడించేందుకే కూటమిగా ఏర్పడ్డారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో రూ. 7.14 లక్షల కోట్ల మేర అప్పు ఉందని ఆమె ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరగలేదని, దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ సమావేశం అనంతరం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.