Bandi Sanjay: తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు పదోన్నతి లభించింది. పాలనా యంత్రాంగం ఆయనకు కీలక పదవిని అప్పగించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమిస్తూ జాతీయ నాయకత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను ప్రకటించారు. ఏపీ బీజేపీ నేత సత్య కుమార్ కు జాతీయ కార్య దర్శిగా ఛాన్స్ ఇస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన పదవిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించడం లేదా జాతీయ కార్యదర్శిగా నియమించి కొన్ని రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా పంపడం ద్వారా కేంద్ర నాయకత్వం బండి సంజయ్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.. ఒకరికి ఒకే పదవి.. ఆయన రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. దీంతో ఆయన స్థానంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బండి సంజయ్ కు అవకాశం కల్పిస్తారనే ప్రచారం సాగింది. అయితే తాజాగా బండి సంజయ్‌ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది.