Udupi College Case: ఉడిపి కాలేజీ కేసులో సిద్ధరామయ్యపై ట్వీట్.. బీజేపీ కార్యకర్తపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udupi College Case: ఉడిపి కాలేజీ కేసుకు సంబంధించి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై ట్వీట్ చేసినందుకు గానూ బీజేపీ కార్యకర్తపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయబడింది. ఉడిపిలోని ఓ ప్రైవేటు పారామెడికల్ కాలేజీ వాష్‌రూమ్‌లో ఒక విద్యార్థిని వీడియోలను మరో ముగ్గురు ముస్లిం విద్యార్థినులు నగ్నంగా చిత్రీకరించారనే ఆరోపణలపై కర్ణాటకలో బీజేపి భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. బీజేపీ కార్యకర్త శకుంతర కర్ణాటక కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్ చేసిన ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. అధికార పార్టీ ఈ సంఘటనను పిల్లల ఆట అని లేబుల్ చేసిందని ఆరోపించారు. తన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటే తానేం చేసేవాడిని అంటూ సిద్ధరామయ్యపై ఆ కార్యకర్త వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉడిపిలో జరిగిన పిల్లల ఆట కేసును బీజేపీ రాజకీయం చేస్తోందని కర్ణాటక కాంగ్రెస్ గతంలో పేర్కొంది. హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో హనమంత్రయ్ అనే వ్యక్తి శకుంతలపై ఫిర్యాదు చేయగా, ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Also Read: Girls Videos Row: కాలేజీ వాష్‌రూంలో నగ్న దృశ్యాల చిత్రీకరణ.. స్పందించిన జాతీయ మహిళా కమిషన్
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
మహిళా వాష్‌రూమ్‌లలో విద్యార్థినులు స్నానం చేయడం లేదా టాయిలెట్‌లను రికార్డ్ చేయడానికి వీడియో కెమెరాలను ఉంచారని ఆరోపిస్తూ ముగ్గురు విద్యార్థులు — అలిమతుల్ షైఫా, షబానాజ్, అలియాలు ఉడిపిలోని మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ అయ్యారు. రష్మీ సమంత్ అనే కార్యకర్త ఈ సంఘటన గురించి ట్వీట్ చేయడంతో పాటు హిందూ అమ్మాయిలను నగ్న ఛాయాచిత్రాలతో బ్లాక్ మెయిల్ చేశారని చెప్పడంతో పోలీసులు ఈ కేసులో మతపరమైన కోణాన్ని ఖండించారు. తాను చేసిన ట్వీట్‌ను ఉద్దేశించి తనను భయపెట్టడానికి పోలీసులు తన ఇంటికి వచ్చారని బీజేపీ కార్యకర్త శకుంతల ఆరోపించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంస్థాగత పీడనకు వ్యతిరేకంగా నిలబడినందుకు హిందువులపై బెదిరింపులు, వేధింపులకు గురిచేస్తోందని బీజేపీ ఆరోపించింది.
ಮುಸ್ಲಿಂ ಯುವತಿಯರು ಟಾಯ್ಲೆಟ್ ನಲ್ಲಿ ಕ್ಯಾಮೆರಾ ಇಟ್ಟು ಹಿಂದೂ ಹೆಣ್ಣುಮಕ್ಕಳ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದು ಕಾಂಗ್ರೆಸ್ನವರ ಪ್ರಕಾರ ಮಕ್ಕಳಾಟವಂತೆ..@siddaramaiah ನವರ ಸೊಸೆ or ಹೆಂಡ್ತಿ ಅವ್ರ ವಿಡಿಯೋವನ್ನು ಇದೆ ತರ ಮಾಡಿದ್ರೆ
ಅದನ್ನು ಮಕ್ಕಳಾಟ ಅಂತ ಒಪ್ಕೋತೀರಾ? pic.twitter.com/jP0QTKvL5R— ಶಕುಂತಲ ನಟರಾಜ್ (@ShakunthalaHS) July 25, 2023
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!