బీజేపీ పార్టీ వాళ్లు కావాలని గొడవలు చేశారు అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొ్న్నారు. దేవరకోట ఆలయ ఈవోని బెదిరించి అసభ్య పదజాలంతో దూషించారు అని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పారు.
Mahua Moitra: పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు, ఖరీదైన గిఫ్టులను లంచంగా తీసుకున్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ, పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు అఫిడవిట్ దాఖలు చేయడంతో మోయిత్రా కేసులో చిక్కుకుంది.
రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు ఈ ఎన్నికలు.. ఒక్క కేసీఆర్ ను కొట్టడానికి ఎన్ని సమీకరణాలు మారుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు.. రైతులు, మహిళలను ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది.. మైనార్టీల ఓట్లు డివైడ్ కావడం వల్ల ప్రజలకు నష్టం.. కాంగ్రెస్ కు ఎన్నికలు ఓ ఆట.. మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా చూస్తోంది అని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు.
Revanth Reddy: బీజేపీ.. జనసేనతో పాటూ కేఏపాల్ ను కూడా కలుపుకుంటే బాగుండని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లోని ఎఐసిసి కార్యాలయం లో టి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ల మాట్లాడారు.
Amith Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణకు రానున్నారు. రాత్రికి అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు.
సంగారెడ్డి గడ్డపై ఈ సారి గులాబీ జెండా ఎగరేస్తామని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎన్ని గ్రామాల్లో తిరిగారని ఆయన ప్రశ్నించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పార్టీ మార్పుపై స్పందించారు. ఇప్పటికే లేఖ విడుదల చేశానన్న రాజగోపాల్ రెడ్డి.. 2009 నుంచి 2014 వరకు తెలంగాణ కోసం పని చేశానన్నారు. కాంగ్రెస్లో నాయకత్వ ఎంపికలో జరిగిన తప్పుడు నిర్ణయాల వల్లా కాంగ్రెస్ రెండు సార్లు ఓడిపోయిందన్నారు.
మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో కారుక వినోద్ అనే వ్యక్తి రాజ్ భవన్ ప్రధాన గేటు వద్ద పెట్రోల్ బాంబులను విసిరాడు. 2022లో చెన్నైలోని బీజేపీ కార్యాలయం వద్ద బాంబులు విసిరిన కేసులో కూడా వినోద్ అరెస్టయ్యాడు. ఈకేసులో మూడు రోజుల క్రితమే విడుదయ్యాడు.