కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బీసీలు ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయనతో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యే ఈటల రాజేందర్లు రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. breaking news, latest news, telugu news, big news, brs, bjp,
మహరాష్ట్రలో 7 గంటలు, కర్ణాటకలో మూడు గంటలే కరెంట్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. డీకే శివకుమార్ అక్కడే కరెంట్ ఇవ్వడం లేదు తెలంగాణ కు ఏం మొహం పెట్టుకొని ప్రచారం చేస్తారన్నారు. breaking news, latest news, telugu news, big news, harish rao, bjp, brs, congress
శుక్రవారం రాత్రి జహీరాబాద్ సభలో మాట్లాడిన ఓవైసీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కవలలు అంటూ విమర్శించారు. ఈ రెండు కూడా తెలంగాణలో విజయం సాధించలేవని ఆయన అన్నారు. ‘‘ అమిత్ షా గారు, మీకు బాధ్యతతో చెబుతున్నాను, మీరు కాంగ్రెస్ కవలలు అయ్యారు. తెలంగాణలో ప్రజలు మీకు అనుకూలంగా లేరు. మీకు బైబై చెబుతారు’’ అంటూ ఓవైసీ అన్నారు.
BJP Leadper Babu Mohan Said I Will Resign from BJP: తనకు టికెట్ ఇవ్వకపోవడంపై బీజేపీపై ఆ పార్టీ నేత బాబు మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయదల్చుకోలేదని, తాను ఎన్నికలతో సహా పార్టీకి దూరంగా ఉండబోతున్నానని తెలిపారు. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి పార్టీకి కూడా రాజీనామా చేస్తా అని బాబు మోహన్ స్పష్టం చేశారు. తనను, తన కొడుకును విడదీసే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని…
CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అససరాల పట్ల ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారని శుక్రవారం మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కర్ణాటక ఆకాంక్షలను, అవసరాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందించినప్పటికీ.. కేంద్రం రాష్ట్రానికి నిధులను ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
PM Modi: ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’లో కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రధాని నరేంద్రమోడీ. శుక్రవారం మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్ ని ప్రారంభించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ‘పాత ఫోన్’గా అభివర్ణించారు. 2014లోనే ప్రజలు ఆ ఫోన్లను వదిలేసి దేశ గతని మార్చే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆయన అన్నారు.
సూర్యాపేటలో బీజేపీ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అని ఆయన ఆరోపించారు.
లోకల్, నాన్ లోకల్ అనే వారికి ఒకటే సమాధానం చెబుతున్నాను అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. బ్రోకర్ ముఖ్యమంత్రి కొడుకు సిరిసిల్లలో లోకల్ అయినప్పుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకుగా నేను లోకల్ నే అవుతాను అని ఆయన వెల్లడించారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. అదే సోషల్ మీడియాలో సమాధానాలు చెప్పండి.. గతంలో సిరిసిల్లకు ఇప్పటి సిరిసిల్లకు తేడాను సోషల్ మీడియాలో ప్రచారం చేయండి.. సిరిసిల్ల ఒకప్పుడు ఉరిసిల్లగా ఉండే.. కానీ, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో తెలపండి అని ఆయన అన్నారు.