బీజేపీ- బీఆర్ఎస్ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డు విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోశ అంటూ కార్డులో కాంగ్రెస్ పేర్కొంది. కేసీఆర్ ఫాంహౌజ్లో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల పెండ్లి అంటూ వివాహ పత్రిక విడుదల చేసింది.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మధ్య జరిగిన సమావేశం గురించి ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. తామిద్దరం పుల్వామా దాడి, జమ్మూ కాశ్మీర్లో పరిస్థితుల గురించి చర్చించినట్లు వెల్లడించారు. అదానీ వ్యవహారం గురించి చర్చించినట్లు వెల్లడించారు. ఇద్దరి మధ్య ఈ భేటీ ఈడీ, సీబీఐల ప్రయేయాన్ని పెంచుతుందా..? అంటూ కేంద్రంపై వ్యంగాస్త్రాలు సంధించారు.
Rajasthan: రాజస్థాన్ లో దారుణం జరిగింది. భూమి విషయంలో తగాదా ఒకరి దారుణ హత్యకి కారణమైంది. ఒక వ్యక్తి తన సోదరుడిపై నుంచి ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు. ఒకసారి కాదు 8 సార్లు అతనిని ట్రాక్టర్ తో తొక్కించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లోని భరత్పూర్ లో చోటు చేసుకుంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరమని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు బీజేపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన వెల్లడించారు.
తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బుధవారం స్పష్టత రానున్నట్లు బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
Etela Rajender: రాజగోపాల్ రెడ్డి ఎలా మాట మార్చారు..? హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. రాజ గోపాల్ రెడ్డి రాజీనామా చేయాల్సింది కాదని తెలిపారు.
Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తనకు ఎలాంటి సమాచారం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ పాలకుల చేతుల్లో అధికారం పెడితే తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారు అంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణలో గొప్ప నగరంగా కరీంనగర్ ను తీర్చిదిద్దుతా.. ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు పరీక్షించే నాయకునికి పట్టం కట్టాలి అని మంత్రి గంగులా కమలాకర్ కోరారు.
Vivek Venkataswamy: నేను బీజేపీకి రాజీనామా చేయ్యనని.. రాజగోపాల్ రెడ్డి గురించి నాకు తెలియదని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నేను బీజేపీకి రాజీనామా చేయడం లేదు' అని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు.