మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తి దాడి దుదృష్టకరం, బాధాకరం అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. ప్రజాస్వామ్య లో దాడులు పరిష్కారం కావు.. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. పాలమూరు నుండి నేరుగా ఆస్పత్రికి వెళ్లి ప్రభాకర్ రెడ్డినీ పరామర్శిస్తాను అని ఆయన తెలిపారు. నిందితుడు రాజు జై కాంగ్రెస్, జై మిరుదొడ్డి మండలం అని ఫేస్ బుక్ లో స్టేటస్ పెట్టుకున్నాడు అంటూ బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. వీహెచ్ తో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి.. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి సీపీ పూర్తి వివరాలు వెల్లడిస్తే బాగుండేది అని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.
Read also: Madonna Sebastian: అరేయ్.. ఆంటోనీ దాస్.. ఎలారా.. ఇంత అందాన్ని నరబలి ఇచ్చావ్
దిపాయన్ పల్లీ గ్రామానికి చెందిన కార్యకర్త స్వామినీ పోలీసులు మఫ్టీలో ఎత్తుకెళ్లారు అని రఘునందన్ రావు ఆరోపించారు. దుబ్బాక బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు.. కొంత మంది కౌన్సిలర్లు మా సిబ్బందిపై భౌతిక దాడి చేశారు.. పోలీసుల ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.. బీజేపీ నాయకుల ఇళ్లు, దుకాణాలపై దాడులు చేస్తున్నారు.. ఎన్నికల కోడ్ అమలు లో ఉంటే రఘునందన్ రావు దిష్టి బొమ్మ దహనం చేస్తుంటే ఏం చేస్తున్నారు.. దళిత బంధు రాలేదని ఆవేదనతో ఘటనకు పాల్పడ్డాడు అని కొన్ని మీడియాలో వస్తోంది.. కార్యకర్తలు సంయమనం పాటించండి.. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దు అని రఘునందన్ రావు అన్నారు.
Read also: Omar Abdullah: ఇండియా కూటమి బలంగా లేకపోవడం దురదృష్టకరం
రాజు మద్యం మత్తులో ఉన్నాడు, కుటుంబ సభ్యులతో కలహాలు ఉన్నాయని మీడియాలో వస్తోంది రఘునందన్ రావు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి సీపీ వివరాలు వెల్లడిస్తే బాగుండేది.. సీపీ వాఖ్యల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అనుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కండువా కప్పినట్టు ప్రచారం జరుగుతున్న వ్యక్తి నిందితుడు కాదు.. పొడేటి నర్సింహులు నిన్ననే బీఆర్ఎప్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరాడు అని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.. సిద్దిపేట సీపీపై వారం క్రితమే డీజీపీకి ఫిర్యాదు చేశాను.. సీఎం అడుగులకు మడుగులు నొక్కుతున్నారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణానికి చెరో వైపు అంటూ రఘునందన్ రావు మండిపడ్డారు.