BJP Released Second List For Telangana Candidates: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండో జాబితాను విడుదల చేసింది. ఈరోజు విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ పేరుకు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. అతి త్వరలోనే…
Telangana Politics: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జోరు పెరిగింది. ఎన్నికల ముహూర్తం సమీపిస్తుండడంతో రాష్ట్రంలో పార్టీల మధ్య నేతల బదిలీలు ఊపందుకున్నాయి. ఇప్పటికే చాలామంది ఉన్న పార్టీ నుండి మరో పార్టీకి మకాం మార్చేశారు. అయితే తాజాగా బీజేపీ నేత కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఈయన ఆ తరువాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ పార్టీ తరుపున పోటీ చేయగా ప్రత్యర్థి అయినటువంటి…
బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకులపై అమ్ముడు పోయారని బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ పనికి మాలినవని ఏనుగులు పోతుంటే కుక్కలు చాలా మొరుగుతాయని వాటిని పట్టించుకోకూడది మంత్రి తలసాని అన్నారు. మాటెత్తితే జైశ్రీరామ్ అనే మీరు అదే శ్రీరాముడుపై ఒట్టేసి మీరు చేస్తున్న ఆరోపణలు రుజువు చేసుకుంటారా అని సవాల్ చేశారు.
5 States Elections: 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అనే రీతిలో పోరాడుతున్నాయి. దీంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ విమర్శలు వివాదాస్పదం అవుతున్నాయి.
గజ్వేల్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై పై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలు అనగానే చాలా మంది వచ్చి ఏదేదో మాట్లాడతారు.. మనల్ని మభ్య పెడతారు.. నవంబర్ 30 తరువాత గజ్వేల్ లో ఎవరు ఉండరు అని ఆయన పేర్కొన్నారు.
Tiger claw row: ‘పులిగోరు’ వివాదం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై బీజేపీ, అధికార కాంగ్రెస్ మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. రాజ్యసభ ఎంపీ, నటుడు జగ్గేష్ టీవీ లైవ్ షో ఇంటర్వ్యూలో పులి-గోరు లాకెట్ ధరించి కనిపించడంతో అతని ఇంట్లో అటవీ శాఖ సోదాలు చేసింది. అంతకుముందు కన్నడ స్టార్ హీరో దర్శన్ కూడా ఇలాంటి లాకెట్ ధరించి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని ఇంట్లో కూడా అటవీ శాఖ…
ప్రస్తుతం ఆలయం దాదాపుగా నిర్మించబడింది, విగ్రహ ఏర్పాటు జనవరి 22న నిర్వహించబడుతుంది, ప్రధాని మంత్రిని ఆహ్వానించాం, ఆయన మా ఆహ్వానాన్ని అంగీకరించారని అన్నారు. ఇది కేవలం త్యాగాల గురించి కాదని, భక్తి, విశ్వాసాలకు సంబంధించిందని ఆయన అన్నారు.
ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్ నాకు కొత్త కాదు..మీతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది.. నేను గజ్వేల్ వచ్చింది నాకు నియోజకవర్గం లేక కాదు.. 20 సంవత్సరాలు నాతో పని చేయించుకుని నా మెడలు పట్టుకుని బయటికి గెంటేశారు అని ఆయన ఆరోపించారు.
నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హేమా హేమీలకు ఓటమి తప్పదు.. ఎన్నికల్లో ఓడిపోయిన కవితకు మా గురించి మాట్లాడే అర్హత లేదు అని ధర్మపురి అర్వింద్ అన్నారు.