Off The Record: మాజీ ఎంపీ వివేక్ మరోసారి పార్టీ మారుతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా… మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి నిర్ణయాలపై తర్జనభర్జనలు కామన్ అయ్యాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీగా గెలిచారాయన. 2013లో బీఆర్‌ఎస్ గూటికి చేరారు. తిరిగి 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు స్వగృహ అంటూ కాంగ్రెస్‌లోకే వెళ్ళారు. అప్పుడు పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడాయన పార్టీ మారిన సంగతి కూడా ప్రజల్లోకి వెళ్ళక పోవడం ఓటమికి ప్రధాన కారణం అన్న విశ్లేషణలు వచ్చాయి. నాటి ఓటమి తర్వాత అదీ ఇదీ కాదని కాషాయ కండువా కప్పుకున్నారు వివేక్. ఇన్ని రోజులు బీజేపీలోనే ఉన్నారాయన. మాజీ ఎంపీని చెన్నూర్ అసెంబ్లీ సీటు నుంచి బరిలో నిలపాలని డిసైడ్ చేసింది కమలం పార్టీ.
కానీ… ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తే.. అధికార పార్టీ అభ్యర్థిని ఢీ కొట్టడం కష్టమన్న ఉద్దేశ్యంతో తాను లోక్‌సభకు పోటీ చేస్తానని చెప్పారట ఆయన. ఆ విషయంలో ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోవడంతో… మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. నేడో, రేపో ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమంటున్నారు సన్నిహితులు. వివేక్…. తన తండ్రి వెంకట స్వామి వారసత్వాన్ని అందిపుచ్చుకోగలిగినా….రాజకీయాల్లో నిలకడ లేని తనంతో తన పొలిటికల్ కెరీర్‌ని తానే సమాధి చేసుకుంటున్నారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. తరచూ పార్టీలు మారడం వల్ల ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఎలా మారతారో అర్ధంగాక కేడర్‌లో సైతం గందరగోళం పెరుగుతోందట. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌కు, అక్కడి నుంచి తిరిగి కాంగ్రెస్‌కు, అట్నుంచి బీజేపీకి, మళ్ళీ మరో సారి కాంగ్రెస్ అంటుంటడంతో… ఈ నిలకడలేని తత్వాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక జట్టు పీక్కుంటున్నారట అనుచరులు. ఎక్కడా ఇమడలేక తిరిగి కాంగ్రెస్‌లో చేరబోతున్నా… ఇక్కడైనా స్థిరంగా ఉంటారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట. పార్టీ మారాక ఆయన చెన్నూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పుకుంటున్నారు.
Also Read
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
అక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్కసుమన్‌ను ఢీ కొట్టాలంటే బలమైన ప్రత్యర్థి కావాలని భావించిన కాంగ్రెస్ పార్టీ… ఆర్థిక బలం, కుటుంబ రాజకీయ వారసత్వం ఉన్న వివేక్‌ను రంగంలోకి దింపబోతున్నట్టు తెలిసింది. వెంకటస్వామి కుటుంబంపై గౌరవవం ఉన్నవారంతా… చెన్నూరులో వివేక్‌కు మద్దతిస్తారని లెక్కలేస్తోందట కాంగ్రెస్. చెన్నూర్ సీటును సీపీఐకి ఇస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. అయినా… చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని వివేక్‌ను దింపాలని డిసైడైనట్టు తెలిసింది. వివేక్ కోసం సీటు త్యాగం చేయాలని సీపీఐకి కూడా ప్రతిపాదించినట్టు తెలిసింది. అట్నుంచి ఇంకా స్పష్టత రాకున్నా… చెన్నూర్ టిక్కెట్ హామీతోనే ఆయన పార్టీ మారబోతున్నట్టు తెలిసింది. వివేక్ ముఖ్య అనుచరులు సైతం ఈ మేరకు నియోజకవర్గంలో హడావిడి మొదలుపెట్టారు. అయితే ఆయన నోటి నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా వేచి చూద్దామనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?