ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి విజయ సాయిరెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పకుంటే.. ఆయన పర్యటనలను అడ్డుకుని తీరుతామని తెలిపారు. మద్యం అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నాం.. కాదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా..? అని ప్రశ్నించారు. బుద్దుండే వాడు ఎవడూ ఇలా మాట్లాడడు.. మళ్లీ ఆడిటర్ అని విజయసాయి రెడ్డి చెప్పుకుంటారని విమర్శించారు. వైసీపీలో అందరూ కొడాలి నాని లాగానే కావాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. నాని ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలీదు.. విజయసాయిరెడ్డి కూడా అదే మార్గంలో వెళుతున్నాడని భాను ప్రకాష్ పేర్కొన్నారు.
Nikki Haley: ట్రంప్ గెలుపు అమెరికాకు ప్రమాదకరం.. ఇండో-అమెరికన్ నిక్కీహేలీ
ప్రతిపక్ష పార్టీలను తిట్టడం, సీఎంను మెప్పించడమే వైసీపీ నాయకుల పని అని భాను ప్రకాష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్, అవినీతి ప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. బీజేపీ గురించి వైసీపీ నేతలా మాట్లాడేది అని మండిపడ్డారు. డిజిటల్ యుగం నడుస్తుంటే.. మద్యం అమ్మకాల్లో కరెన్సీ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ల్యాండ్, శాండ్, మైన్స్ ద్వారా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తామని భావిస్తున్నారని.. ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా జగన్ కు ప్రజలు ఓటు వేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Dudekula Simha Garjana: చట్టసభల్లో స్థానమే లక్ష్యం.. గుంటూరులో నూర్ బాషా దూదేకుల సింహగర్జన
వచ్చే ఎన్నికలలో ఈ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని భాను ప్రకాష్ తెలిపారు. మీరే కాదు బటన్ నొక్కేది.. పోలింగ్ రోజు ప్రజలు కూడా బటన్ నొక్కి జగన్ ను సాగనంపుతారని విమర్శించారు. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పనులతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు.. కానీ జగన్ మాత్రం స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొడితే.. గొడ్డును కొట్టినట్లు వైసీపీ నాయకులు కొట్టారని మండిపడ్డారు. వారిపై యాక్షన్ తీసుకోవాలంటే పోలీసులకు భయమని..
ఈ పరిణామాలకు కర్త, కర్మ, క్రియ తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే జగన్ మాత్రమేనని భాను ప్రకాష్ అన్నారు.